Vastu Tips: ఇంట్లో చేప‌ల పెయింటింగ్ పెడితే ఏం జ‌రుగుతుంది.? వాస్తు ఏం చెబుతోందంటే..

Vastu Tips: ఇల్లు అందంగా కనిపించేందుకు చాలామంది గోడలపై పెయింటింగ్స్, డెకరేషన్ వస్తువులు పెడుతుంటారు.

Update: 2026-03-26 11:05 GMT

Vastu Tips: ఇల్లు అందంగా కనిపించేందుకు చాలామంది గోడలపై పెయింటింగ్స్, డెకరేషన్ వస్తువులు పెడుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పెయింటింగ్స్ ఇంట్లో పెడితే సానుకూల శక్తి పెరుగుతుందని, ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుందని చెబుతారు. ముఖ్యంగా చేపలతో ఉన్న పెయింటింగ్స్‌ను గోడపై పెట్టడం ఇంటికి శుభఫలితాలు తెస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

వాస్తులో చేపల ప్రాధాన్యం

వాస్తు శాస్త్రంలో చేపలను శుభానికి సంకేతంగా భావిస్తారు. నీటిలో ఎప్పుడూ ముందుకు కదులుతూ ఉండే చేపలు జీవితంలో అభివృద్ధి, పురోగతిని సూచిస్తాయని నమ్మకం. అందుకే ఇంట్లో చేపల పెయింటింగ్ పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు. ఇది కేవలం ఇంటి అందాన్ని మాత్రమే కాకుండా, కుటుంబంలో శాంతి, ఆనందం పెరగడానికి కూడా సహాయపడుతుందని భావిస్తారు.

గోల్డెన్ ఫిష్ పెయింటింగ్ ఎందుకు శుభం?

వాస్తు ప్రకారం బంగారు రంగు చేపల పెయింటింగ్ ఇంట్లో ఉంచడం చాలా శుభంగా భావిస్తారు. ముఖ్యంగా 8 చేపల సమూహం ఉన్న పెయింటింగ్ ప్రత్యేకమైనది అని చెబుతారు. ఆ 8 చేపల్లో 7 బంగారు చేపలు, 1 నలుపు రంగు చేప ఉంటే మంచిదని వాస్తు సూచిస్తుంది. ఇది ఇంట్లో మంచి వాతావ‌ర‌ణం పెరగడానికి సహాయపడుతుందని నమ్మకం.

ఏంజెల్ ఫిష్ పెయింటింగ్ ప్రయోజనం

ఇంట్లో ఏంజెల్ ఫిష్ ఉన్న పెయింటింగ్ పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ చేప ఆకృతి అందంగా ఉండటమే కాకుండా ఇంట్లో శాంతి, స్థిరత్వం పెరగడానికి సహాయపడుతుందని నమ్మకం. ఇలాంటి పెయింటింగ్ ఇంటి గోడలపై ఉంటే ఇంటి వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుందని చెబుతారు.

కపూరా చేప పెయింటింగ్ వల్ల కలిగే ప్రయోజనం

ఆర్థికంగా అభివృద్ధి కావాలని కోరుకునే వారు కపూరా చేప (Koi fish) ఉన్న పెయింటింగ్‌ను ఇంట్లో ఉంచితే మంచిదని వాస్తు చెబుతుంది. ఈ చేప ఆకృతి ప్రత్యేకంగా ఉండటం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు, పురోగతి వస్తాయని విశ్వసిస్తారు. ఇలాంటి పెయింటింగ్‌ను ఇంటి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం మరింత శుభఫలితాలను ఇస్తుందని నమ్మకం.

సముద్రంలో ఈదుతున్న చేపల పెయింటింగ్

సముద్రం విశాలత, అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. అందుకే సముద్రంలో ఈదుతున్న చేపలతో ఉన్న పెయింటింగ్ ఇంట్లో ఉంచడం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఇలాంటి చిత్రాలు ఇంట్లో ఉండటం వల్ల. సానుకూల వాతావరణం పెరుగుతుంది, ఇంట్లో ఉన్న భారమైన భావన తగ్గుతుంది, కొత్త అవకాశాలు రావడానికి సహాయపడుతుందని వాస్తు నమ్మకం.

గమనిక: వాస్తు నమ్మకాల ప్రకారం ఈ సూచనలు తెలియ‌జేయ‌డ‌మైంది. వీటిని సంప్రదాయ విశ్వాసాలుగా మాత్రమే పరిగణించాలి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Tags:    

Similar News