Nirmal: నిర్మల్‌లో పెను ప్రమాదం.. ఫ్రిడ్జ్ పేలడంతో ఇద్దరు మృతి!

Nirmal: నిర్మల్‌లో అగ్నిప్రమాదం.. ఒడిసెల విజయ్ సహా మరో మహిళ బలి. ఫ్రిడ్జ్ పేలడంతో చెలరేగిన మంటలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.

Update: 2026-04-05 04:14 GMT

Nirmal: నిర్మల్‌లో పెను ప్రమాదం.. ఫ్రిడ్జ్ పేలడంతో ఇద్దరు మృతి!

నిర్మల్ జిల్లా: కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ వద్ధ గల మహాలక్ష్మివాడ లోని సి బ్లాక్ డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జ్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన అంబులెన్సులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గుర్తుతెలియని మహిళ(40) మృతిచెందగా ఇంటి యజమాని ఒడిసెల విజయ్(50)కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యక్తి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విజయ్ నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News