Kamareddy: మేనూర్ వద్ద విషాదం బైక్ ప్రమాదంలో ముగ్గురు కూలీల మృతి
Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 161 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్. ముగ్గురు కూలీలు మృతి.
Kamareddy: మేనూర్ వద్ద విషాదం బైక్ ప్రమాదంలో ముగ్గురు కూలీల మృతి
Kamareddy: మెనూర్ (కామారెడ్డి) 161 జాతీయ రహదారిపై ఆగి ఉన్న రాజస్తాన్ లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ సమీపంలో మంగళవారం రాత్రి 10 గంటలకు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు మృతులు మద్నూర్ లో కూలీ పనులు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.మృతులు పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన నాగు (48), అదే గ్రామనికి చెందిన సచిన్ (17), జుక్కల్ మండలం నాగాల్గావ్ గ్రామానికి చెందిన అశోక్(21) గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేేసి దర్యాప్తు చేస్తున్నారు.