Nandyal: శ్రీశైల మల్లన్న సేవలో మంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా దర్శనం
Nandyal: నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటన. కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనం.
Nandyal: శ్రీశైల మల్లన్న సేవలో మంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా దర్శనం
నంద్యాల జిల్లా: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మొదట ఆలయం రాజగోపురం వద్ద మంత్రి కొండా సురేఖకు ఈవో శ్రీనివాసరావు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు.అనంతరం మంత్రి సురేఖ ను ఆలయ అధికారులు సత్కరించారు.