Kurnool: ఎమ్మిగనూరులో చేనేత సెగ ఆప్కో విలీనంపై కార్మికుల పోరు!

Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ చేనేత కార్మికులు, వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

Update: 2026-03-31 07:50 GMT

Kurnool: ఎమ్మిగనూరులో చేనేత సెగ ఆప్కో విలీనంపై కార్మికుల పోరు!

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడంపై ఆందోళన చేపట్టారు. కోఆపరేటివ్‌ సొసైటీ ఎదుట చేనేతలు నిరసనకు దిగారు. చేనేత కార్మికులకు మద్దతుగా వైసీపీ, వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. సొసైటీని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై చేనేత కార్మికులు, వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. విలీనం పేరుతో చేనేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. సర్వసభ్య సమావేశంలో విలీన అంశం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో కలిపి ఆస్తులు అమ్మేందుకే కుట్ర చేస్తున్నారని మాజీ ఎంపీ బుట్ట రేణుక అన్నారు. ఆప్కోలో విలీనం అడ్డుకుంటాం.. న్యాయపరంగా పోరాడుతామని బుట్టరేణుక అన్నారు.

Tags:    

Similar News