Kukunoor: గ్రావెల్ తరలిస్తున్న అక్రమార్కులు.. చోద్యం చూస్తున్న అధికారులు
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరాయిగూడెంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది.
Kukunoor: గ్రావెల్ తరలిస్తున్న అక్రమార్కులు.. చోద్యం చూస్తున్న అధికారులు
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని పెదరాయిగూడెం గ్రామంలో అధికార పార్టీ చెందిన నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. ఖాళీగా కనిపించే ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూముల్లోనే జెసిబిలతో గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో ఈ పరిస్థితి సర్వసాధారణమై పోయింది. గ్రావెల్ అక్రమ రవాణా పై అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించడం లేదు.
దీంతో అక్రమార్కులు ఆడింది ఆట పాడింది పాటలా తయారైంది. మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న గ్రావెల్ మాఫియా అగడాలను మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడంతో యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు జరుగుతోంది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో నెలలో రెండు, మూడు పర్యాయాలు గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న అధికారులు మాత్రం కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. గ్రావెల్ తవ్వకాలు జరిపిన ప్రతిసారి విచ్చలవిడిగా నాలుగైదు రోజులు ఎలాంటి అనుమతులు లేకుండా
యదేచ్చగా గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. అధికారపార్టీకి చెందిన స్థానిక నాయకులే ఈ తతంగం నడిపిస్తున్నారనే ఆరోపణలు పహాటంగానే వినిపిస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెదరాయి గూడెం పంచాయతీ పరిధిలోని గ్రామాలలోని ఇంటి అవసరాల నిమిత్తమని చెబుతూ, జామాయిల్, జామ క్లోన్ నర్సరీలకు గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయనికి భారీగా గండి పడుతుంది.
విషయం తెలిసినప్పటికీ అధికారులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన నర్సరీలకు ప్రభుత్వ, అటవీ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ, తరలిస్తు సొమ్ము చేసుకుంటున్న రని పలువురు చెబుతున్నప్పటికీ అధికారం ఉందికదా మనల్ని ఆపే దమ్ము, ధైర్యం ఎవరికి ఉందని గ్రావెల్ మాఫియా బరితెగిస్తుంది. అటవీ, ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ అధిక ధరలకు గ్రావెల్‌ను విక్రయిస్తు న్నారు.
ట్రాక్టర్ లోడ్ రూ.800 నుంచి రూ. 1200 ల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. ఉచితంగానే ప్రభుత్వ, అటవీ భూముల్లో గ్రావెల్ గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ బహిరంగ మార్కెట్లో విక్రయించి లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా తరలీస్తున్న గ్రావెల్ మాఫియాకు సహకరిస్తున్న స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటుగా గ్రావెల్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.