Nellore: ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం తెస్తాం.. దేవాదాయ మంత్రి

Nellore: నెల్లూరు జిల్లాలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు.

Update: 2026-03-31 10:01 GMT

Nellore: ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం తెస్తాం.. దేవాదాయ మంత్రి

Nellore: జిల్లాలోని ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించారు మంత్రి ఆనం.. ఈ సందర్భంగా దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా, నూతన ఆలయాల నిర్మాణం మొదలైన అంశాలపై చర్చించారు మంత్రి ఆనం.

జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో కోట్లాది రూపాయలతో జరుగుతున్న పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. నూతన ఆలయాల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆనం. ప్రాచీనా ఆలయాలు , ప్రసిద్ధ దేవాలయాలు గుర్తించి వాటికి పూర్వ వైభవం వచ్చేలా పునర్నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. తన పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైన తన వద్దకు రావాలని వెంటనే పరిష్కారం సూచించి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సూచనలు ఇచ్చారు.

మన భావితరాలకి మన దేవాలయాల విశిష్టతను వాటి వైభవాన్ని తరతరాలు చెప్పుకునేలా మనం కృషి చేయాలని అధికారులతో చర్చించారు. అసంబద్ధమైన ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఎవరు భయపడవద్దని మనం చేసే అభివృద్ధి ఆలయ నిర్మాణ కార్యక్రమాలే సమాధానం చెబుతాయని ప్రజలు మన వైపే ఉన్నారని చెప్పారు మంత్రి ఆనం.

జరుగుతున్న పనులన్నీ కూడా వేగవంతం చేయాలని ఎక్కడ జాప్యం లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆనం. సమావేశానికి రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్‌రెడ్డి, వివిధ ఆలయాల ఈవోలు హాజరయ్యారు.

Tags:    

Similar News