Kanchili: రాములోరికి గౌతు శివాజీ ప్రత్యేక పూజలు
Kanchili: కంచిలి మండల కేంద్రంలోని ప్రసిద్ధ సీతారాముల ఆలయాన్ని మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ దర్శించుకున్నారు.
Kanchili: రాములోరికి గౌతు శివాజీ ప్రత్యేక పూజలు
Kanchili: కంచిలి మండల కేంద్రంలోని సీతారాముల ఆలయానికి మంగళవారం మాజీమంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారికి మంగళహారతులు అందజేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతకుముందు గౌతు శ్యాంసుందర్ శివాజీకి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.