Bodi Tribe: సిక్స్ ప్యాక్ కాదు.. 'పెద్ద పొట్ట' ఉంటేనే అందగాడు! ఈ తెగ వింత ఆచారం తెలిస్తే షాక్ కావాల్సిందే..

Bodi Tribe: సిక్స్ ప్యాక్ ఉంటే కాదు.. ఇక్కడ పెద్ద పొట్ట ఉంటేనే అందగాడు! ఇథియోపియా 'బోడి' తెగ వింత ఆచారం, రక్తం-పాలు తాగే షాకింగ్ డైట్ గురించి ఈ ట్రెండింగ్ స్టోరీలో చదవండి.

Update: 2026-03-31 10:48 GMT

Bodi Tribe: సిక్స్ ప్యాక్ కాదు.. 'పెద్ద పొట్ట' ఉంటేనే అందగాడు! ఈ తెగ వింత ఆచారం తెలిస్తే షాక్ కావాల్సిందే..

Bodi Tribe: ఈ రోజుల్లో చాలా మంది జిమ్‌లో గంటల కొద్దీ టైం స్పెండ్ చేస్తూ.. సిక్స్ ప్యాక్ కోసం, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడం కోసం కష్టపడుతున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఒక చోట మాత్రం చాలా వింతైన ఆచారం ఒకటి అమలులో ఉంది. నిజానికి అక్కడ కండలు ఉన్నవాడు అందగాడు అంటే.. పెద్ద పొట్ట ఉన్నవాడినే అసలైన అందగాడిగా, బలవంతుడిగా భావిస్తారు. ఆ వింత ఆచారం ఎక్కడ ఉంది? ఆ పెద్ద పొట్ట కోసం వారు చేసే సాహసాలేంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

ఇథియోపియాలోని 'బోడి' తెగ వింత ఆచారం..

ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాకు చెందిన ఓమో వ్యాలీలో నివసించే 'బోడి' (Bodi Tribe) తెగ ప్రజల ఆచారాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ తెగలో పురుషుడి అందానికి కొలమానం అతని సిక్స్ ప్యాక్ కాదు, అతని పొట్ట సైజ్. అవునండీ బాబు.. ఈ తెగలో ఎంత పెద్ద పొట్ట ఉంటే వాళ్లు అంద ఎక్కువ అందగాళ్ల కింద లెక్క. ఎవరి పొట్ట పెద్దగా ఉంటే, వారి తెగలో అతనికి అంత ఎక్కువ గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఈ తెగలో ప్రతి ఏటా 'కాయెల్' (Ka'el) అనే ప్రత్యేక పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు అక్కడి తెగ వారు ఒక ప్రత్యేకమైన పోటీని ప్రతీ ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ప్రత్యేకమైన పోటీ ఏంటో కాదు.. ఎవరికీ ఎంత పెద్ద పొట్ట ఉందో తెలుసుకోవడం. ఇందులో విన్నర్‌ కావడానికి ఆ తెగకు చెందిన యువకులు పోటీకి ఆరు నెలల ముందు నుంచే పక్కా ప్రణాళికతో రెడీ అవుతుంటారు. ఈ పోటీలో పాల్గొనేవారు ఆరు నెలల పాటు ప్రత్యేక గుడిసెలకే పరిమితం కావాలి. ఈ సమయంలో వారు ఎలాంటి శారీరక శ్రమ చేయకూడదు. కేవలం వాళ్లు తింటూ, నిద్రపోతూ బరువు పెరగడమే ప్రధాన లక్ష్యంగా బతుకుతారు.

షాకింగ్ డైట్..

జిమ్‌కు వెళ్లేవారు ప్రోటీన్ షేక్స్ ఎలా అయితే తాగుతారో, ఈ పోటీలో పాల్గొనే వాళ్లు కూడా ఒక వింతైన 'ఎనర్జీ డ్రింక్'ను తాగుతారు. ఆ డ్రింగ్ ఏంటంటే.. ఆవు పాలలో తాజా ఆవు రక్తాన్ని కలిపి తయారు చేసేది. ఆ డ్రింగ్‌ను ఈ పోటీలో పాల్గొనే వారు రోజంతా తాగుతుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రక్తం కోసం వారు ఆవును చంపడం లాంటివి చేయరు.. కేవలం సిరంజిల ద్వారా రక్తాన్ని తీసుకొని, తర్వాత ఆ గాయానికి మందు పూస్తారు. ఈ డ్రింగ్ తీసుకోవడం వల్ల వారి పొట్టలు బెలూన్లలా ఉబ్బుతాయని వారి నమ్మకం.

విజేతకు 'సూపర్‌ మోడల్' హోదా

పండుగ రోజున ఈ పురుషులంతా ఒంటికి బూడిద, మట్టి పూసుకుని నృత్యం చేస్తారు. ఎవరి పొట్ట అయితే అందరికంటే పెద్దగా ఉంటుందో, వారిని ఆ ఏడాదికి 'హీరో'గా ప్రకటిస్తారు న్యాయనిర్ణేతలు. ఈ పోటీలో విజేతగా నిలిచిన వ్యక్తికి వాళ్ల తెగలో క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర సినిమా స్టార్స్‌కు, క్రికెటర్స్‌కు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. ఈ పోటీలో నిలిచి గెలిచిన హీరోను బోడి తెగ యువతులు తమ జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు క్యూ కడుతుంటారు. ఈ పోటీలో ఒక్కసారి గెలిస్తే, గెలిచిన ఆ వ్యక్తికి జీవితాంతం వారి సమాజంలో అత్యున్నత గౌరవం లభిస్తుంది.

Tags:    

Similar News