Aroori Ramesh: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
Aroori Ramesh: వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్
Aroori Ramesh: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
Aroori Ramesh: పార్లమెంట్ ఎన్నికల వేల బీఆర్ఎస్ పార్టీకీ భారీ షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలతో పాటు పలువురు బీజేపీలో చేరగా.. తాజాగా వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆరూరి రమేష్ కు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో చర్చలు జరిపిన అనంతరం ఆయన పార్టీలో చేరేందుకు సిద్దం అయ్యారు. అమిత్ షాతో భేటీ అయి కాషాయ కండువ కప్పుకున్నారు.