Nandyal: డోన్ అధికారులకు బుగ్గన వార్నింగ్.. నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు!
Nandyal: నంద్యాల జిల్లా డోన్ ఆర్&బి గెస్ట్ హౌస్ అధికారులపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. వాకింగ్ ట్రాక్ నిర్వహణ లోపంపై అధికారులకు హెచ్చరిక.
Nandyal: డోన్ అధికారులకు బుగ్గన వార్నింగ్.. నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు!
నంద్యాల జిల్లా: డోన్ పట్టణంలో ఆర్&బి అధికారుల పనితీరుపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డోన్‌లోని ఆర్&బి గెస్ట్ హౌస్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేసిన ఆయన, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో అందంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌తో పాటు ప్రజల కోసం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై అధ్వానంగా మారిందని అన్నారు. అధికారులు భవనంలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే వాకింగ్ ట్రాక్‌ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని, నిర్లక్ష్యానికి కారణమైన వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.