Eluru: రఘురామ కాన్వాయ్‌పై దాడి నిందితులను శిక్షించాలని డిమాండ్!
Eluru: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కాన్వాయ్‌పై జరిగిన దాడిని వేలేరుపాడు జనసేన మండల ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్ తీవ్రంగా ఖండించారు.
Eluru: రఘురామ కాన్వాయ్‌పై దాడి నిందితులను శిక్షించాలని డిమాండ్!
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండల జనసేన ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్ ఆకివీడు పెదపేటలోని రామాలయాన్ని శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు దర్శించుకునే సమయంలో జరిగిన దాడిని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామని సంజయ్ ఒక ప్రకటన లో తెలిపారు. రఘురామ కృష్ణం రాజు కాన్వాయ్‌పై రాళ్లతో దాడికి దిగడం అత్యంత దారుణమైన చర్య అని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు చోటు లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం హేయమైన చర్య అని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పవిత్రమైన శ్రీరామ నవమి పర్వదినం రోజున జరిగిన ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.