Kanchili: బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బెందాళం అశోక్

Kanchili: కంచిలి మండలం కుత్తుమ గ్రామంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్.

Update: 2026-03-26 13:22 GMT

Kanchili: బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బెందాళం అశోక్

Kanchili: కంచిలి మండలం కుత్తుమ పంచాయతీకి చెందిన బలగ మణి ఆరోగ్య ఖర్చులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును గురువారం ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అందజేశారు. కుత్తుమ గ్రామంలో టీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు మాదిన రామారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 85 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగుతుందని చెప్పారు. భవిష్యత్తులోనూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News