Pattikonda: రైతు సంక్షేమమే మా లక్ష్యం: ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ బాబు స్పష్టం

Pattikonda: పత్తికొండ మండలం మండగిరి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ బాబు.

Update: 2026-03-26 13:59 GMT

Pattikonda: రైతు సంక్షేమమే మా లక్ష్యం: ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ బాబు స్పష్టం

Pattikonda: పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కే.ఈ. శ్యాం బాబు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ వారి సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాన్ని మండగిరి గ్రామం, పత్తికొండ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వము రైతుల ఆర్థిక అభివృద్ధికి

ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు.

రైతులు పంట మార్పిడి విధానాన్ని అలవాటు చేసుకోవాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. పాడి సంపద అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు.

పశుసంవర్ధక శాఖ తరపున కాలానుగుణంగా పశువులకు వ్యాధులు రాకుండా ఉచిత టీకాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు.

తద్వారా ఆరోగ్యం కాపాడటమే కాకుండా పాలు ఉత్పత్తి పెంపు సాధ్యమవుతుందని, రైతులు ఆర్థికంగా మెరుగుపడతారని పేర్కొన్నారు.

గడ్డి కొరత రాకుండా గడ్డి విత్తనాలను మరియు పశువుల దాణా ను సబ్సిడీ ద్వారా అందుబాటులోకి తెచ్చిందన్నారు.

అలాగే పశువుల కొరకు షెడ్డు నిర్మాణాలను కూడా చేపట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వము అందిస్తున్న పశుసంవర్ధక సేవలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పశువులకు ఉచిత వైద్య సేవలు, టీకాలు, వైద్య పరీక్షలు మరియు గొడ్డుమోతు పశువులకు పరీక్షలు చేసి చికిత్సలు అందజేసినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలియజేశారు.

అదేవిధంగా పశుపోషణ, వ్యాధి నిరోధక చర్యలు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖులు సాంబశివారెడ్డి, ప్రమోద్ కుమార్ రెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నబి సాబ్ , బత్తిని లోకనాథ్ మరియు స్థానిక నాయకులు, డా.సోమశేఖర్ గౌడ్, డా. లక్ష్మన్న డా. స్వర్ణలత, కిషోర్ మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News