Nellore: యువత మేల్కొనాలి.. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి!

Nellore: నెల్లూరు జిల్లా దుత్తలూరులో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ. ఎస్సై ఆదిలక్ష్మి మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సైమాన్ రావు ఆధ్వర్యంలో విద్యార్థుల మానవహారం.

Update: 2026-03-26 12:17 GMT

Nellore: యువత మేల్కొనాలి.. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి!

నెల్లూరు జిల్లా: దుత్తలూరులో యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా నినాదాలతో సాగిన ఈ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి “డ్రగ్స్‌కు నో చెప్పండి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు అవును చెప్పండి” అనే సందేశాన్ని బలంగా చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్సై ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. యువత తప్పుదోవ పట్టకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రిన్సిపాల్ సైమాన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News