Kukkunur: కుక్కునూరులో రోడ్ల ఆక్రమణల జోరు పట్టించుకోని ఆర్‌ అండ్‌ బి అధికారులు!

Kukkunur: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఆర్‌ అండ్‌ బి రహదారుల ఆక్రమణలు. ఇరుకుగా మారుతున్న ప్రధాన రోడ్లు.

Update: 2026-03-26 12:47 GMT

Kukkunur: కుక్కునూరులో రోడ్ల ఆక్రమణల జోరు పట్టించుకోని ఆర్‌ అండ్‌ బి అధికారులు!

ఏలూరు జిల్లా: కుక్కునూరు మండంలంలో ఆర్‌ అండ్‌ బి రహదారి మార్జిన్‌ను దర్జాగా కొందరు ఆక్రమిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ అండ్ బి,పంచాయితీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆక్రమణలకు అడ్డుచెప్పేవారు లేరు. దీనితో రహదారి ఇరు వైపులా ఆక్రమణలతో కుచించుకుపోయింది. విశాలంగా ఉన్న రహదారులు ప్రస్తుతం ఇరుకు రోడ్లుగా మారిపోయాయి. కుక్కునూరు, కివ్వాక, మారేడుబాక,కొండపల్లి,వింజరం,చీరవల్లి,దమరచర్ల,ఉప్పెరు, రాజీవ్ నగర్, అమరవరం, కమ్మరిగూడెం, బంజరగూడెం,ఇబ్రహీంపేట, బోనగిరి, అల్లిగూడెం, పెదరాయిగూడెం, వెంకటాపురం,వేలేరు గ్రామాల్లో ప్రధాన రహదారులకు ఇరువైపులా ఇండ్లు, దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు.

రహదారి మార్జిన్ ఆక్రమించి రహదారికి ఇరువైపులా నిర్మించిన ఇండ్లు, దుకాణాలకు ఆయా పంచాయతీల సెక్రటరీలు ఇంటి పన్ను మరియు దుకాణం పనులు జారీ చేస్తుండటంతో ఆక్రమణదారులు రోడ్లకు ఇరువైపులా ఎక్కడ ఖాళీ స్థలం కనపించినా అక్రమ నిర్మాణాలు చేపట్టి దుకాణాలు తెరుస్తున్నారు. రోడ్లపై వాహనాలు నిలిపి సరుకులు కొనుగోలు చేసేందుకు జనం దుకాణాల్లోకి వెళ్తున్నారు. దీంతో రోడ్లు ఇరుకుగా ఉండటంతో పెద్ద వాహనాలు ఎదురె దురుగా వస్తే తప్పుకునే అవకాశం లేక ప్రమాదాలకు గురవుతున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు సైతం ప్రమాదాల భారిన పడే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి ఆర్‌ అండ్‌ బి రోడ్ల ఆక్రమణలను తొలగించి ప్రయాణిల సౌకర్యార్థం రోడ్లను పరిరక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News