Nellore: మార్కాపురం ప్రమాదంపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దిగ్భ్రాంతి!

Nellore: మార్కాపురం రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర విచారం. 13 మంది మృతిపై దిగ్భ్రాంతి.

Update: 2026-03-26 12:43 GMT

Nellore: మార్కాపురం ప్రమాదంపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దిగ్భ్రాంతి!

Nellore: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత బాధాకరమని తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.

ఈ విషాద సమయంలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఆమె ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News