BYD Atto 1: బీవైడీ నుంచి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్.. అదిరిపోయే ఫీచర్లు.. ధరెంతో తెలిస్తే పరేషానే..!
BYD Atto 1: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ (BYD), మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా తన సరికొత్త చిన్న ఎలక్ట్రిక్ కారు 'ఎట్టో 1' (Atto 1) ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ. 12.32 లక్షల ప్రారంభ ధరతో, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 380 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఈ కారు ఇప్పుడు వాహన రంగంలో హాట్ టాపిక్ అయింది.
BYD Atto 1: బీవైడీ నుంచి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్.. అదిరిపోయే ఫీచర్లు.. ధరెంతో తెలిస్తే పరేషానే..!
BYD Atto 1: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో అగ్రగామిగా ఉన్న బీవైడీ సంస్థ, థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 'బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో 2026' వేదికగా తన అత్యంత చవకైన మోడల్ ఎట్టో 1 ను ఆవిష్కరించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణానికి అనువుగా రూపొందించిన ఈ అర్బన్ ఎలక్ట్రిక్ వాహనం, సామాన్యులకు కూడా ఈవీ (EV) కలలను సాకారం చేసే విధంగా ఉంది. భారత కరెన్సీ ప్రకారం దీని ప్రారంభ ధర రూ. 12.32 లక్షలు కాగా, గరిష్ట వేరియంట్ ధర రూ. 13.18 లక్షలుగా నిర్ణయించారు.
అద్భుతమైన బ్యాటరీ, మైలేజీ..
ఈ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 30.08 కిలోవాట్ అవర్, 38.88 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన బ్లేడ్ ఎల్ఎఫ్పి బ్యాటరీలను అమర్చారు. ఇవి ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జ్ చేస్తే 300 నుంచి 380 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలు కల్పిస్తాయి. ఇందులోని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ 74 హార్స్‌పవర్, 135 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5 సెకన్లలోనే ఈ కారు గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం విశేషం.
ఆధునిక డిజైన్, కొలతలు..
ఎట్టో 1 కారు పొడవు 3,925 మిమీ, వెడల్పు 1,720 మిమీ, ఎత్తు 1,590 మిమీగా ఉంది. 2,500 మిమీ వీల్‌బేస్ ఉండటం వల్ల లోపల ప్రయాణికులకు తగినంత స్థలం లభిస్తుంది. దీనికి ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్ (DRL), స్పోర్టీ రియర్ స్పాయిలర్, 15 అంగుళాల అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.
సురక్షిత, విలాసవంతమైన ఫీచర్లు..
ఇంటీరియర్ విషయానికి వస్తే, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక వసతులు ఉన్నాయి. భద్రతకు పెద్దపీట వేస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS), క్రూయిజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరాను కూడా ఇందులో చేర్చారు. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రకాల రైడింగ్ మోడ్స్ డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.
త్వరలోనే ఈ కారు భారత మార్కెట్లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు కోసం చూసే వారికి ఇది ఉత్తమ ఎంపిక కానుంది.