32 కిమీల మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్స్.. రూ. 7 లక్షలలోపు ఫ్యామిలీ మెచ్చే బెస్ట్ కార్స్ ఇవే..!
రూ. 7 లక్షలలోపు హ్యాచ్‌బ్యాక్ కార్లలో మైలేజ్, సేఫ్టీ, ఫీచర్లను బట్టి ఎన్నో మంచి ఎంపికలు ఉన్నాయి. మీ అవసరం, డ్రైవింగ్ స్టైల్, ఫ్యామిలీ అవసరాల ప్రకారం సరైన కారు ఎంపిక చేసుకుంటే మీ ప్రయాణం మరింత సౌకర్యంగా మారుతుంది.
32 కిమీల మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్స్.. రూ. 7 లక్షలలోపు ఫ్యామిలీ మెచ్చే బెస్ట్ కార్స్ ఇవే..!
రూ. 7 లక్షల బడ్జెట్‌లో కొత్త కారు కొనాలనుకుంటున్న వారికి ఇప్పుడు మార్కెట్లో అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్, సేఫ్టీ, ఫీచర్లు ఇలా అన్నీ కలిసిన హ్యాచ్‌బ్యాక్‌లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. మారుతి, టాటా, హ్యుందాయ్, రెనో వంటి బ్రాండ్లు ఈ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తున్నాయి.
రూ. 7 లక్షలలోపు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు..
మారుతి సుజుకి స్విఫ్ట్: యువతకు ఫస్ట్ చాయిస్‌గా నిలిచిన ఈ కారు స్పోర్టీ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. 1.2 లీటర్ ఇంజిన్‌తో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. పెట్రోల్‌లో సుమారు 24-25 kmpl మైలేజ్ ఇవ్వగా, CNGలో 32.85 km/kg వరకు అందిస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు దీని ప్రత్యేకత. ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టాటా టియాగో: సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి ఇది బెస్ట్ ఎంపిక. గ్లోబల్ NCAP నుంచి 4 స్టార్ రేటింగ్ పొందింది. బలమైన బాడీతో పాటు మంచి రైడ్ క్వాలిటీ, ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్ అందిస్తుంది. రూ. 5.65 లక్షల ప్రారంభ ధరలో మంచి ఫ్యామిలీ కారుగా నిలిచింది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్: ఇంటీరియర్, స్మూత్ డ్రైవింగ్ అనుభవానికి ప్రసిద్ధి. 8-ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నగర డ్రైవింగ్‌కు AMT వేరియంట్ మంచి ఎంపికగా నిలుస్తుంది.
మారుతి వాగన్ ఆర్: టాల్-బాయ్ డిజైన్ వల్ల లోపల విస్తారమైన స్పేస్ ఉంటుంది. పెద్దలకూ సౌకర్యంగా ఉంటుంది. పెట్రోల్, CNG ఆప్షన్లతో అందుబాటులో ఉండి, CNGలో 34 km/kg వరకు మైలేజ్ ఇస్తుంది.
టాటా ఆల్ట్రోజ్: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఉన్న ఈ కారు స్టైలిష్ డిజైన్, హై సేఫ్టీతో ప్రసిద్ధి. రూ. 6.65 లక్షల వద్ద ప్రారంభమయ్యే వేరియంట్లు మంచి విలువ ఇస్తాయి. హైవే డ్రైవింగ్‌కు ఉత్తమ ఎంపికగా నిలిచింది.
మారుతి బలెనో: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. పెద్ద కేబిన్, 318 లీటర్ల బూట్ స్పేస్, అవసరమైన అన్ని ఫీచర్లతో ఫ్యామిలీకి అనువైన కారు. ప్రారంభ ధర రూ. 6.66 లక్షలుగా ఉంది.
రెనో క్విడ్, సిట్రోయెన్ C3: రెనో క్విడ్ తక్కువ బడ్జెట్‌లో SUV లుక్, 184mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక సిట్రోయెన్ C3 మంచి కంఫర్ట్ రైడ్, రిఫైన్డ్ ఇంజిన్‌తో ప్రత్యేకతను అందిస్తుంది. కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునేవారికి ఇవి మంచి ఆప్షన్లు.