Nissan Gravite: రూ. 5.65 లక్షలకే ఫర్ ఫెక్ట్ ఫ్యామిలీ కార్.. ఫీచర్లు చూశారంటే, ఇప్పుడే బుక్ చేస్తారంతే..!

Nissan Gravite Base Model Price: భారత మార్కెట్‌లో తక్కువ ధరలో ఎక్కువ భద్రతా ఫీచర్లు కలిగిన కార్లు అరుదుగా కనిపిస్తాయి. అయితే కొత్తగా వచ్చిన Nissan Gravite 7-సీటర్ MPV కేవలం రూ.5.65 లక్షల ప్రారంభ ధరలోనే 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. బడ్జెట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నవారికి ఇది మంచి ఎంపికగా మారుతోంది.

Update: 2026-03-14 14:28 GMT

Nissan Gravite: రూ. 5.65 లక్షలకే ఫర్ ఫెక్ట్ ఫ్యామిలీ కార్.. ఫీచర్లు చూశారంటే, ఇప్పుడే బుక్ చేస్తారంతే..!

Nissan Gravite Features: జపాన్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ మెటార్ కార్పోరేషన్ (Nissan Motor Corporation) ఇటీవల భారత మార్కెట్‌లో కొత్త 7-సీటర్ MPV అయిన నిస్సాన్ గ్రావిటీ (Nissan Gravite)ను విడుదల చేసింది. ఈ కార్ బేస్ వేరియంట్ ధర కేవలం రూ.5.65 లక్షల ఎక్స్‌షోరూమ్ నుంచి ప్రారంభం కానుంది. ఇది దేశంలోనే అత్యంత చవకైన 7-సీటర్ కార్లలో ఒకటిగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌లో పెద్ద కుటుంబానికి సరిపోయే సురక్షితమైన కార్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.

ఇంజిన్, మైలేజ్..

నిస్సాన్ గ్రావిటీ (Nissan Gravite) బేస్ మోడల్ పేరు విసియా (Visia). ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 72 PS పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రకారం ఈ కార్ లీటర్‌కు సుమారు 19.6 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు సరిపడే మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది.

స్పేస్, సీటింగ్ సామర్థ్యం..

ఈ కార్ పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ లోపల మంచి స్థలం ఉంటుంది. ఇందులో మొత్తం 7 మంది సౌకర్యంగా కూర్చోవచ్చు. ఈ కార్ ప్రత్యేకత ఏమిటంటే రెండో, మూడో వరుస సీట్లను అవసరానికి అనుగుణంగా మడతపెట్టుకోవచ్చు. కేవలం 5 మంది ప్రయాణిస్తే వెనుక సీట్లను మడిచి 625 లీటర్ల బూట్ స్పేస్ పొందవచ్చు. దీని వల్ల కుటుంబ ప్రయాణాలకు సరిపడా సామాను సులభంగా తీసుకెళ్లవచ్చు.

భద్రతా ఫీచర్లు..

ఎంట్రీ లెవల్ కార్లలో సాధారణంగా భద్రతా ఫీచర్లు తక్కువగా ఉంటాయి. కానీ గ్రావిటీ (Gravite) బేస్ మోడల్‌లోనే 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తున్నారు. అదనంగా హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు కూడా స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా జారి పడే పరిస్థితుల్లో కార్ నియంత్రణలో ఉండేందుకు సహాయపడతాయి.

డిజైన్, లుక్..

డిజైన్ పరంగా గ్రావిటీ (Gravite) చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్ బదులుగా 14 ఇంచ్ స్టీల్ వీల్స్ ఇచ్చినప్పటికీ బ్లాక్ గ్రిల్, స్కిడ్ ప్లేట్స్ కారణంగా ఇది SUV తరహా లుక్ ఇస్తుంది. ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ 182 మిల్లీమీటర్లు ఉండటం వల్ల భారత రోడ్లకు అనుకూలంగా ఉంటుంది.

బేస్ మోడల్‌లో లేని ఫీచర్లు..

ఈ బేస్ వేరియంట్‌లో కొన్ని ప్రీమియం ఫీచర్లు అందుబాటులో లేవు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేదా మ్యూజిక్ సిస్టమ్ ఇవ్వలేదు. రియర్ విండోలకు మాన్యువల్ హ్యాండిల్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే రివర్స్ కెమెరా, రియర్ వైపర్, పుష్ బటన్ స్టార్ట్, అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా లేవు. ఈ ఫీచర్లు కావాలంటే ఎక్కువ ధర ఉన్న వేరియంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News