Best Cars For Beginners: ఫస్ట్ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అధిక మైలేజ్ ఇచ్చే ఈ 4 కార్లు బెస్ట్ ఛాయిస్..!
Best Cars For Beginners: ఇటీవల డ్రైవింగ్ నేర్చుకుని మొదటి కార్ కొనాలని భావిస్తున్నవారికి సరైన ఎంపిక చాలా ముఖ్యమైనది. చిన్న సైజు, సులభమైన డ్రైవింగ్, మంచి మైలేజ్ ఉన్న కార్లు కొత్త డ్రైవర్లకు ఉత్తమంగా ఉంటాయి. మార్కెట్‌లో ప్రస్తుతం తక్కువ ఖర్చుతో మంచి పనితీరు ఇచ్చే నాలుగు కార్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
Best Cars For Beginners: ఫస్ట్ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అధిక మైలేజ్ ఇచ్చే ఈ 4 కార్లు బెస్ట్ ఛాయిస్..!
Best Cars For Beginners: డ్రైవింగ్ నేర్చుకున్న వెంటనే చాలా మంది ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనడానికి ఆసక్తి చూపుతారు. ఈ కార్లు సైజులో చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేయడం సులభం. అలాగే పార్కింగ్ చేయడం కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ కార్లు మంచి మైలేజ్ ఇవ్వడం వల్ల నెలవారీ ఇంధన ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. కొత్తగా డ్రైవింగ్ ప్రారంభించే వారికి ఇవి ఉత్తమ ఎంపికగా భావిస్తుంటారు. ఈ లిస్ట్ లో ఏ కార్లు ఉన్నాయో ఓసారి చూద్దాం..
Maruti Suzuki Alto K10:
కొత్త డ్రైవర్లకు ఇప్పటికీ ఆల్టో కంటే బెస్ట్ ఆప్షన్ చాలా అరుదనే చెప్పాలి. చిన్న సైజు కారణంగా చిన్న రోడ్లు, భారీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ కార్‌ను సులభంగా నడపవచ్చు. ఈ కారులో ఉన్న K10 ఇంజిన్ శక్తివంతంగా ఉండటంతో పాటు క్లచ్ కూడా చాలా లైట్‌గా ఉంటుంది. అందువల్ల కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ కార్ లీటర్‌కు సుమారు 24 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది.
Maruti Suzuki S-Presso:
రోడ్ క్లియర్‌గా కనిపించాలనుకునే డ్రైవర్లకు ఈ కార్ మంచి ఎంపిక. ఇందులో డ్రైవింగ్ పొజిషన్ కొంచెం ఎత్తుగా ఉండటం వల్ల ముందున్న రోడ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి, చెత్త రోడ్లు లేదా ఎత్తైన స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు కూడా కార్ కింది భాగానికి పెద్దగా ప్రమాదం ఉండదు.
Tata Tiago:
తక్కువ ధరలో సేఫ్టీ ఎక్కువగా ఉండే కార్ కావాలనుకుంటే టియాగో మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఈ కార్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. కొత్త డ్రైవర్లకు చిన్నపాటి స్క్రాచ్‌లు లేదా పార్కింగ్ సమయంలో తగిలే ప్రమాదాలు సహజం. అలాంటి సందర్భాల్లో టియాగో బలమైన నిర్మాణం వల్ల పెద్దగా నష్టం కలగదు. స్టీరింగ్ కూడా చాలా స్మూత్‌గా పని చేస్తుంది.
Renault Kwid:
తక్కువ బడ్జెట్‌లో SUV లుక్ ఉన్న కార్ కావాలనుకునేవారికి రెనాల్ట్ క్విడ్ మంచి ఎంపిక. ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి కొత్త డ్రైవర్లకు పార్కింగ్ సమయంలో చాలా సహాయపడతాయి. ఇంకా ముఖ్యంగా ఈ కార్ టర్నింగ్ రేడియస్ తక్కువగా ఉండటం వల్ల చిన్న రోడ్లలో కూడా సులభంగా మలుపు తిప్పుకోవచ్చు.
కొత్త కార్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
♦ కొత్త డ్రైవర్లు కార్ కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
♦ చిన్న సైజు కార్ ఎంచుకోవడం మంచిది
♦ మంచి మైలేజ్ ఉన్న మోడల్ తీసుకోవాలి
♦ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయా లేదా చూడాలి
♦ పార్కింగ్, ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయగలిగే కార్ కావాలి
ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే మొదటి కార్ కొనుగోలు మరింత సులభమవుతుంది.