Mahindra BE 6 Batman Edition: కేవలం 7 నిమిషాల్లో 999 యూనిట్లు బుక్.. ఇంత క్రేజ్ ఏంటి మావా..!
Mahindra BE 6 Batman Edition: మహీంద్రా ఎలక్ట్రిక్ SUV BE 6 Batman Edition మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. రెండో బ్యాచ్‌కు చెందిన 999 యూనిట్లు కేవలం 7 నిమిషాల్లో పూర్తిగా బుక్ అయ్యాయి. ప్రత్యేక డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ.28.49 లక్షలుగా నిర్ణయించారు.
Mahindra BE 6 Batman Edition: కేవలం 7 నిమిషాల్లో 999 యూనిట్లు బుక్.. ఇంత క్రేజ్ ఏంటి మావా..!
Mahindra BE 6 Batman Edition: భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ఇటీవల తన ప్రత్యేక ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ (Mahindra BE 6 Batman Editionను మళ్లీ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ SUV రెండో బ్యాచ్‌లో విడుదల చేసిన 999 యూనిట్లు కేవలం 7 నిమిషాల్లోనే పూర్తిగా బుక్ కావడం విశేషం.
ఇంతకుముందు 2025 ఆగస్టు 14న విడుదల చేసిన మొదటి బ్యాచ్ కూడా కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా సేల్ అయింది. దీంతో ఈ ఎలక్ట్రిక్ SUVపై వినియోగదారుల్లో ఉన్న ఆసక్తి మరోసారి బయటపడింది.
ధర, డెలివరీ వివరాలు..
Mahindra BE 6 Batman Edition ఎక్స్-షోరూమ్ ధర రూ.28.49 లక్షలుగా నిర్ణయించారు. ఇది BE 6 Pack Three 79kWh వేరియంట్‌పై ఆధారపడి రూపొందించబడింది. మొదటి బ్యాచ్ మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త ఎడిషన్ ధర సుమారు రూ.70,000 ఎక్కువగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV డెలివరీలు 2026 ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
ప్రత్యేకమైన ఎక్స్‌టీరియర్ డిజైన్..
Batman థీమ్‌తో వచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్ SUVలో ప్రత్యేకమైన డిజైన్ కనిపిస్తుంది.
ఇది సాటిన్ బ్లాక్ పెయింట్ ఫినిష్తో అందుబాటులో ఉంది. అలాగే ఫ్రంట్ ఫెండర్, వీల్ హబ్‌క్యాప్‌లు, రియర్ బంపర్‌పై బ్యాట్ లోగో కనిపిస్తుంది.
ఎక్స్‌టీరియర్ ఫీచర్లు..
20 ఇంచ్ అలాయ్ వీల్స్
గోల్డెన్ ఫినిష్ బ్రేక్ క్యాలిపర్స్
పానోరమిక్ గ్లాస్ రూఫ్
ఆటోమేటిక్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్
పవర్డ్ టెయిల్‌గేట్
ఈ ప్రత్యేక డిజైన్ వల్లే Batman అభిమానులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇంటీరియర్, టెక్నాలజీ ఫీచర్లు..
ఇంటీరియర్‌లోనూ ప్రీమియం ఫీచర్లు..
అందులో డ్యుయల్ 12.3 ఇంచ్ HD స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), హార్మన్ కార్డన్ 16 స్పీకర్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ మెమరీ ఫంక్షన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, అదనంగా 7 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ, రేంజ్, పనితీరు..
Mahindra BE 6 Batman Editionలో 79kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ ప్రకారం ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 683 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ SUVలో 282 BHP పవర్, 380 Nm టార్క్ ఇచ్చే రియర్ వీల్ డ్రైవ్ మోటార్ ఉంది. 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో చేరుతుంది. అదనంగా 175kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20 నుంచి 80 శాతం వరకు కేవలం 20 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు.