Maruti Suzuki Dzire: 33 కిమీల మైలేజ్.. 5 స్టార్ సేఫ్టీతో అదిరిపోయే ఫీచర్లు.. ఫ్యామిలీకి బెస్ట్ కార్ ఇదే..!

Maruti Suzuki Dzire: భారత కార్ మార్కెట్‌లో మరోసారి మారుతి సుజుకి డిజైర్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 33+ మైలేజ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో కుటుంబ కస్టమర్లను ఆకర్షిస్తోంది.

Update: 2026-03-16 16:08 GMT

Maruti Suzuki Dzire

Maruti Suzuki Dzire: మారుతి సుజుకి డిజైర్ మరో పెద్ద రికార్డు సాధించింది. 2008లో తొలిసారి భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ సెడాన్, నాలుగు తరాల మార్పులతో వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు అభివృద్ధి చెందుతూ వచ్చింది. తాజాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, డిజైర్ మొత్తం 30 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటింది.

అదే సమయంలో క్యాలెండర్ ఇయర్ 2025లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా నిలిచి తన మార్కెట్ బలాన్ని మరోసారి నిరూపించింది. కుటుంబ వినియోగదారులు, రోజువారీ ప్రయాణికులు, మైలేజ్ కోరుకునే కొనుగోలుదారుల మధ్య డిజైర్‌కు మంచి ఆదరణ కొనసాగుతోంది.

ధర ఎంత?

మారుతి సుజుకి డిజైర్ ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండే రేంజ్‌లోనే ఉన్నాయి. ఈ కార్ బేస్ వేరియంట్ ధర రూ.6.26 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.9.31 లక్షలు వరకు ఉంటుంది.

అదే సమయంలో సీఎన్‌జీ వేరియంట్లు రూ.8.03 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. తక్కువ బడ్జెట్‌లో ఫీచర్లు, మైలేజ్, భద్రతతోపాటు ఆల్ ఇన్ వన్ ప్యాకేజీ కోరుకునే వారికి ఈ ధరల శ్రేణి ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఇంజిన్, మైలేజ్‌లో డిజైర్ బలం..

డిజైర్‌లో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. సీఎన్‌జీ పవర్‌ట్రైన్ ఎంపిక కూడా అందుబాటులో ఉండటం మరో ప్లస్ పాయింట్.

మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 24.79 kmpl, పెట్రోల్ AMT 25.71 kmpl, సీఎన్‌జీ వేరియంట్ అయితే 33.73 km/kg మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సెగ్మెంట్‌లో ఇది ఒక ప్రధాన ఆకర్షణగా చెప్పాలి.

5-స్టార్ సేఫ్టీతో ఫీచర్ల వర్షం..

డిజైర్‌కు భారత్ NCAP, గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించడం విశేషం. దీంతో ఇది ఫ్యామిలీకి ఫర్ ఫెక్ట్ గా సరిపోయే కార్ గా నిలిచింది.

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఏసీ, 6 ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ESC, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

2025లో 2,14,488 యూనిట్లు అమ్ముడైన ఈ డిజైర్‌కు మార్కెట్‌లో Hyundai Aura, Honda Amaze ప్రధాన పోటీదారులు.

Tags:    

Similar News