Honda 0 Alpha: హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్టింగ్ షురూ.. ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే భయ్యో..?
Honda electric SUV India: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో హోండా తన కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘హోండా 0 ఆల్ఫా’కు దేశవ్యాప్తంగా పబ్లిక్ రోడ్ టెస్టింగ్‌ను ప్రారంభించింది.
Honda electric SUV India
Honda electric SUV India: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో హోండా పెద్ద అడుగు వేసింది. తన కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘హోండా 0 ఆల్ఫా’కు దేశవ్యాప్తంగా పబ్లిక్ రోడ్ టెస్టింగ్‌ను అధికారికంగా ప్రారంభించింది. భారత రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ వాహనాన్ని పరీక్షిస్తూ, గ్లోబల్ లాంచ్‌కు కంపెనీ సిద్ధమవుతోంది.
హోండా కార్స్ ఇండియా (HCIL) తన రాబోయే బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) ఎస్‌యూవీకి దేశవ్యాప్తంగా టెస్టింగ్‌ను ప్రారంభించింది. రాజస్థాన్‌లోని తపుకారా నుంచి ఈ టెస్టింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంపెనీ, భారత మార్కెట్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా Honda 0 α (హోండా 0 ఆల్ఫా) పేరుతో గుర్తిస్తున్నారు. ఈ ప్రోటోటైప్‌ను జపాన్ మొబిలిటీ షో 2025లో మొదటిసారి ప్రదర్శించారు. ఇప్పుడు భారతదేశంలో దీనిపై రియల్-వరల్డ్ టెస్టింగ్ ప్రారంభం కావడం కంపెనీ ఎలక్ట్రిఫికేషన్ వ్యూహంలో కీలక అడుగుగా భావిస్తున్నారు.
భారత పరిస్థితులకు అనుగుణంగా విస్తృత పరీక్షలు..
హోండా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని హైవేలు, నగర రహదారులు, కఠినమైన భూభాగాలు వంటి విభిన్న భారతీయ డ్రైవింగ్ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. ఇందులో వాహనం మన్నిక, హ్యాండ్లింగ్, రైడ్ కంఫర్ట్, ఎనర్జీ ఎఫిషియెన్సీ, విశ్వసనీయత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
అదే సమయంలో భారతదేశంలోని తీవ్రమైన ఎండలు, మాన్సూన్ కాల వాతావరణంలో కూడా ఈ మోడల్‌ను పరీక్షిస్తారు. వేర్వేరు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ల వద్ద ఛార్జింగ్ పనితీరును పరిశీలించి, రోజువారీ వినియోగానికి అనువుగా తీర్చిదిద్దడమే కంపెనీ లక్ష్యమని అధికారిక ప్రకటనలో తెలిపింది.
హోండా సీఈఓ ఏమన్నారంటే?
హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓ తకాషి నకాజిమా మాట్లాడుతూ, “భారతదేశంలో పాన్-ఇండియా పబ్లిక్ రోడ్ వెరిఫికేషన్ టెస్టింగ్ ప్రారంభం కావడం మా ఎలక్ట్రిఫికేషన్ ప్రయాణంలో ఒక ముఖ్య మైలురాయి. భారతదేశానికి ప్రత్యేకమైన డ్రైవింగ్, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అందుకే రియల్-వరల్డ్ ఎన్విరాన్‌మెంట్స్‌లో మా ఎలక్ట్రిక్ వాహనాన్ని పూర్తిగా పరీక్షించడం చాలా అవసరం” అని అన్నారు.
లాంచ్ టైమ్‌లైన్, బ్యాటరీ..
హోండా 0 ఆల్ఫా ఎస్‌యూవీని FY 2026-27లో గ్లోబల్‌గా ప్రవేశపెట్టే ప్రణాళిక ఉంది. ఇందులో భారత్, జపాన్ కీలక మార్కెట్లుగా ఉండనున్నాయి. ఈ వాహనాన్ని భారతదేశంలోనే తయారు చేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశముంది.
ఈ ఎస్‌యూవీకి సుమారు 2,700mm నుంచి 2,800mm వరకు వీల్‌బేస్ ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది. అలాగే 65kWh నుంచి 75kWh మధ్య రెండు LFP బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
భారత మార్కెట్‌లో ఈ మోడల్‌కు Mahindra BE 6, Maruti e Vitara, Hyundai Creta Electric, Tata Curvv EV, MG ZS EV వంటి వాహనాలు ప్రధాన పోటీదారులుగా నిలవనున్నాయి. ధర సుమారు రూ.25 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా.