Ramabhadrapuram: లారీ క్యాబిన్‌లో డ్రైవర్ అనుమానాస్పద మృతి!

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం భూసాయి వలస వద్ద లారీ క్యాబిన్‌లో డ్రైవర్ వినయ్ మిశ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Update: 2026-04-10 05:14 GMT

Ramabhadrapuram: లారీ క్యాబిన్‌లో డ్రైవర్ అనుమానాస్పద మృతి!

రామభద్రపురం (విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం భూసాయి వలస కోల్డ్ స్టోరేజ్ సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీ క్యాబిన్ లో డ్రైవర్ వినయ్ మిశ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చత్తీస్ గఢ్ నుంచి వచ్చిన నాలుగు లారీలు బుధవారం రాత్రి రోడ్డు పక్కన నిలిపారు లారీ గురువారం సాయంత్రం అయినా కదలకపోవడంతో మరో లారీ డ్రైవర్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News