Russia Discount Gas India: రష్యా మాస్టర్‌ప్లాన్ 40 శాతం డిస్కౌంట్‌తో గ్యాస్...షాడో ఫ్లీట్‌కు భారత్ అంగీకరిస్తుందా?
Russia Discount Gas India: ప్రపంచంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది చమురు మాత్రమే.
Russia Discount Gas India
Russia Discount Gas India: ప్రపంచంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది చమురు మాత్రమే. ప్రంపంచ చమురు మార్కెట్‌లో ఇప్పుడొక ఆసక్తికరమైన మైండ్‌గేమ్ నడుస్తోంది. గల్ఫ్‌లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచంలోని చాలా దేశాల్లో గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఫలింతగా తక్కువ ధరకు గ్యాస్, చమురు ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాయి. దీనిని తనకు అనుకూలంగా చేసుకోవాలని చూస్తోంది రష్యా. ఏకంగా 40 శాతం డిస్కౌంట్ సేల్ ప్రారంభించి భారత్ లాంటి దేశాలకు గాలం వేస్తోంది. ఈ చౌకైన గ్యాస్ నేరుగా రష్యా నుంచి రాదు. దీని వెనుక షాడోఫ్లీట్ అనే రహస్య నెట్‌వర్క్ ఉంటుంది. ఈ నెట్‌వర్క్ నుంచి గ్యాస్ సరఫరా అవుతుంది. దీనిపైనే అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది.
రష్యా వ్యూహం
గల్ఫ్ యుద్ధం ప్రభావంతో ఖతార్‌లో గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. అంతేకాకుండా, హోర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో దిగుమతిపై ఆధారపడే దేశాల్లో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్యాస్ కొరత ఏర్పడటంతో ఆయా దేశాల్లోని గ్యాస్ కంపెనీలు ధరలు పెంచేశాయి. భారత్, బంగ్లాదేశ వంటి దేశాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది రష్యా. ఆంక్షల కారణంగా నిలిచిపోయిన తమ ఆర్కిటిక్ ఎల్‌ఎన్‌జీ 2 ప్రాజెక్ట్ గ్యాస్‌ను ఎలాగైనా విక్రయించాలని ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ డీల్ నేరుగా ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థల నుంచి కాకుండా మధ్యవర్తుల ద్వారానే జరుగుతుంది. నోవాటెక్ వంటి సంస్థలు గ్యాస్‌ను ఇతర దేశాల పేర్లతో షిప్పింగ్ డాక్యుమెంట్లు తయారు చేసి వివిధ దేశాలకు విక్రయిస్తారు. ఈ విధానాన్ని పేపర్ లాండరింగ్ అని పిలుస్తారు.
షాడో ఫ్లీట్.. ఎలా పనిచేస్తుంది?
ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నది షాడో ఫ్లీట్. అంటే పాత నౌకలు, స్పష్టమైన యాజమాన్యం లేని షిప్పులు, రష్యా తన ఆర్కిటిక్ ఎల్‌ఎన్‌జీ 2, పోర్టోవాయా ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టుల నుంచి గ్యాస్‌ను ఈ నౌకల ద్వారా గోప్యంగా రవాణా చేస్తుంది. మన బాషలో చెప్పాలంటే ఒకవిధంగా అఫిషియల్ స్మగ్లింగ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చైనా మాత్రమే ఈ విధానంలో గ్యాస్‌ను కొనుగోలు చేసింది. ఈ విధానం తప్పే అయినా అవసరాల కోసం దిగుమతి చేసుకోక తప్పదు.
భారత్ ముందున్న సవాల్
రష్యా ఈ సరికొత్త ఆఫర్‌ను భారత్ ముందు ఉంచింది. భారత్ షాడో ఫ్లీట్‌కు అంగీకరించి 40 శాతం డిస్కౌంట్‌కు గ్యాస్‌ను కొనుగోలు చేస్తే...ఇంధన ఖర్చులు భారీగా తగ్గుతాయి. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల రంగంపై ఒత్తిడి తగ్గుతుంది. అయితే, అమెరికాతో ఉన్న వ్యూహాత్మక సంబంధాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అంతేకాదు, షాడోఫ్లీట్ ద్వారా రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తే అంతర్జాతీయ ఆంక్షలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తంగా చూసుకుంటే చౌక ధరలో గ్యాస్ కొనాలా? లేక అంతర్జాతీయ ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలా? అన్న ప్రశ్న ఇప్పుడు భారత్ ముందుంది. భారత్ తీసుకునే నిర్ణయం భవిష్యత్ ఇంధన విధానాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది.