Mangalsutra Pearl Coral Benefits: సుఖ ప్రసవం కావాలంటే...మంగళసూత్రంలో ఈ రెండింటిని ధరించాలి

Mangalsutra Pearl Coral Benefits: హిందూ సంప్రదాయంలో స్త్రీ సౌభాగ్యానికి, ఆరోగ్యానికి రక్షా కవచం మంగళసూత్రం. ఆదిశంకరాచార్యులు తన సౌందర్యలహరిలో మంగళసూత్రం విశిష్టతను అద్భుతంగా వర్ణించారు.

Update: 2026-04-10 08:07 GMT

Mangalsutra Pearl Coral Benefits

Mangalsutra Pearl Coral Benefits: హిందూ సంప్రదాయంలో స్త్రీ సౌభాగ్యానికి, ఆరోగ్యానికి రక్షా కవచం మంగళసూత్రం. ఆదిశంకరాచార్యులు తన సౌందర్యలహరిలో మంగళసూత్రం విశిష్టతను అద్భుతంగా వర్ణించారు. మంగళసూత్రంలో ముత్యం, పగడం ఎందకు ధరించాలో, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్యాలేమిటో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవం కావాలంటే ఈ రెండింటి కలయిక అత్యంత ఆవశ్యకమని శాస్త్రం చెబుతోంది.

ముత్యం - చంద్రుని చల్లదనం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు మనస్సుకు, ప్రశాంతతకు, అన్యోన్య దాంపత్యానికి కారకుడు. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం, గర్భధారణ, ప్రసవానికి చంద్రుని ప్రభావం ఉందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అందుకే ముత్యం ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత, శరీరానికి సమతుల్యత కలుగుతుందని నమ్మకం.

పగడం - కుజుని పరాక్రమం

పగడం కుజగ్రహానికి ప్రతీక. కుజుడు రక్తానికి, శక్తికి, దీర్ఘ సౌమాంగల్యానికి కారకుడు. జ్యోతిష్య గణన ప్రకారం, చంద్రుడు 27 నక్షత్రాల గుండా ప్రయాణించి 28వ రోజు కుజునితో కలుస్తాడు. ఈ చక్రం ఆధారంగానే మహిళల నెలసరి ఆధారపడి ఉంటుంది. కుజ దోషాల వల్ల కలిగే అనారోగ్యాలను, కలహాలను పగడం అడ్డుకుంటుంది. అందుకే మంగళసూత్రంలో పగడాన్ని ధరించాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

సుఖ ప్రసవం ఎలా సాధ్యం?

పూర్వ కాలంలో ముత్యం, పగడం ధరించిన మహిళలకు సహజ ప్రసవం ఎక్కువగా జరిగేదని చెప్పుకుంటారు. అయితే ఆధునిక కాలంలో జీవనశైలి మార్పులు, ఆరోగ్య సమస్యలు, వైద్య కారణాలతో ఆపరేషన్‌లు పెరిగాయి. అయినప్పటికీ ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా మంగళసూత్రంలో ధరించే ముత్యాలు, పగడాలు నకిలీవి కాకుండా నిజమైనవై ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజమైన ముత్యాలు, పగడాలు ధరిస్తే శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. నిజమైన పగడాలు, ముత్యాలు సూర్యకిరణాల్లోని శక్తిని గ్రహించి స్త్రీ నాడీ కేంద్రాలను నిరంతరం ఉత్తేజపరుస్తాయి. ఈ శక్తి గర్బాశయ సంబంధిత దోషాలను తొలగించి శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే, ముత్యాలు, పగడాలు అలంకారం కోసం కాకుండా శాస్త్రీయ పద్దతిలో ఈ రెండింటిని ధరించడం వలన మహిళలకు జ్యోతిష్యపరంగా చంద్ర మంగళ యోగం కలుగుతుంది. ఇది వారికి అపారమైన ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

Tags:    

Similar News