Rajanna Sircilla: వెంకట్రావుపల్లిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. సర్పంచ్ సంధ్య–మహేందర్ ఆధ్వర్యంలో ఘన నివాళి.

Update: 2026-04-05 05:27 GMT

Rajanna Sircilla: వెంకట్రావుపల్లిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఈరోజు భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు మరియు సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంధ్య–మహేందర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, నాయకులు కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య–మహేందర్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News