Eluru: మృత్యు పాశమైన విద్యుత్ తీగలు రైతుకు లక్షల్లో నష్టం!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఐదు పశువులు మృతి చెందాయి.
Eluru: మృత్యు పాశమైన విద్యుత్ తీగలు రైతుకు లక్షల్లో నష్టం!
Eluru: విద్యుత్ ఘాతకంలో ఐదు పశువులు మృతి సంఘటన వేలేరుపాడులో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని శివకాశిపురం గ్రామానికి చెందిన వేల్పుల శ్రీనివాసరావు శుక్రవారం పశువులను పొలంలో మేత మేపి సాయంత్రం గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్ ఎదుట ఉన్న పశువుల పాకలో కట్టేసేందుకు పశువులను తోలుతున్న వెళుతున్న సమయంలో 11 కె.వి విద్యుత్ లైన్ తీగలు ఈదురుగాలులకు తెగి పశువుల మీద పడటంతో ఐదు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. పశువులను మేపుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నామని, ముందే పంటలు పండక అప్పుల పాలు అయ్యి ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యుత్ ఘాతుకం వల్ల లక్ష డెబ్భై వేల రూపాయల విలువగల ఐదు పశువులను కోల్పోవడం జరిగిందని ప్రభుత్వం, విద్యుత్ శాఖ ద్వారా కానీ ఐటిడిఎ ద్వారా కానీ బాధిత రైతుకు న్యాయం చేసి ఆర్థిక సాయం అందించి తమను ఆదుకోవాలని బాదిత రైతు ప్రభుత్వాన్ని కోరారు.