Kurnool: ఒకే చోట రెండు ప్రమాదాలు. కర్నూలు కృష్ణానగర్ వద్ద విషాద ఛాయలు!
Kurnool: కర్నూలు కృష్ణానగర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. బైక్ యాక్సిడెంట్ బాధితుడిని కాపాడబోయిన వారిపైకి మరో లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.
Kurnool: ఒకే చోట రెండు ప్రమాదాలు. కర్నూలు కృష్ణానగర్ వద్ద విషాద ఛాయలు!
Kurnool: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణానగర్ సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జిపై అర్థరాత్రి బైక్ ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ వెళ్తున్న శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన మరో లారీ వారిపైకి దూసుకెళ్లింది. దీంతో మరో ఇద్దుర స్పాట్ లోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన తీరును పరిశీలించారు. మంచి చేయడానికి వెళ్తే ఏకంగా ప్రాణాలు కోల్పోయారంటూ స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. మరో వైపు బాధిత కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. గాయపడిన వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.