CBSE Class 10th Result 2026: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలకు ముహూర్తం ఖరారు? రిజల్ట్స్ లింక్ ఇదే!

CBSE Class 10th Result 2026: సీబీఎస్‌ఈ (CBSE) 10వ తరగతి పరీక్షలు రాసిన 25 లక్షల మంది విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది.

Update: 2026-03-25 07:47 GMT

CBSE Class 10th Result 2026: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలకు ముహూర్తం ఖరారు? రిజల్ట్స్ లింక్ ఇదే!

CBSE Class 10th Result 2026: సీబీఎస్‌ఈ (CBSE) 10వ తరగతి పరీక్షలు రాసిన 25 లక్షల మంది విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలు మే 15వ తేదీ నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని విద్యా వర్గాల సమాచారం. అయితే దీనిపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఫలితాల విడుదల సమయం

సాధారణంగా సీబీఎస్‌ఈ ఫలితాలు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య విడుదలవుతుంటాయి. ఫలితాల విడుదలకు ఒక రోజు ముందుగానే బోర్డు అధికారికంగా అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉంది.

ఫలితాలు చూసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్లు:

విద్యార్థులు ఈ క్రింది వెబ్‌సైట్ల ద్వారా తమ స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

https://www.cbse.gov.in/

results.cbse.nic.in

cbseresults.nic.in

స్కోర్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

పైన పేర్కొన్న ఏదైనా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో 'CBSE Class 10 Results 2026' లింక్‌పై క్లిక్ చేయాలి.

మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడి మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

'Submit' బటన్ నొక్కగానే మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్ అవుట్ లేదా PDF సేవ్ చేసుకోవాలి.

డీజీలాకర్ (DigiLocker) ద్వారా ఇలా..

వెబ్‌సైట్ రద్దీగా ఉన్నప్పుడు విద్యార్థులు డీజీలాకర్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు:

డీజీలాకర్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి.

సెక్యూరిటీ పిన్, ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

'Issued Documents' సెక్షన్‌లోకి వెళ్లి 'CBSE 10th Result 2026' ఎంచుకోవాలి.

మీ వివరాలు ఇస్తే డిజిటల్ మార్క్ షీట్ డౌన్‌లోడ్ అవుతుంది.

వెబ్‌సైట్, డీజీలాకర్‌తో పాటు ఉమాంగ్ (UMANG) యాప్‌, ఎస్ఎంఎస్ (SMS) మరియు IVRS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే సదుపాయాన్ని బోర్డు కల్పిస్తోంది.

Tags:    

Similar News