Trump: అమెరికా సైన్యాన్ని రంగంలోకి దింపే ఆలోచన.. యుద్ధ శైలిని మార్చబోతున్న ట్రంప్.?
Trump:మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం మూడో వారంలోకి చేరడంతో, అమెరికా సైనికులను పంపే అవకాశాలను పరిశీలిస్తోంది.

మధ్యప్రాచ్యంలో సైనిక బలగాల పెంపుపై చర్చలు
అమెరికా ప్రభుత్వం వేల సంఖ్యలో అదనపు సైనికులను మధ్యప్రాచ్యంలో పంపించే ప్రణాళికలను పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే, యుద్ధంలో అమెరికా పూర్తిగా దిగినట్లు అవుతుంది. ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్‌ల నుంచే ఇరాన్‌పై అమెరికా అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే.
హార్ముజ్ జలసంధి భద్రత ప్రధాన లక్ష్యం
ప్రపంచానికి అత్యంత కీలకమైన చమురు మార్గం అయిన హార్మూజ్ భద్రతపై అమెరికా ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈ మార్గంలో ఆయిల్ ట్యాంకర్లకు సురక్షిత ప్రయాణం కల్పించడానికి నౌకాదళం, వైమానిక దళాన్ని ఉపయోగించవచ్చు. అవసరమైతే ఇరాన్ తీర ప్రాంతాల్లో సైన్యాన్ని కూడా మోహరించే అవకాశాలు ఉన్నాయి.
ఖార్గ్ దీవిపై దృష్టి
ఇరాన్ చమురు ఎగుమతుల్లో కీలకమైన ఖార్గ్ దీవిపై కూడా అమెరికా దృష్టి సారించింది. ఈ దీవి ద్వారా ఇరాన్ సుమారు 90% చమురు ఎగుమతులు జరుగుతాయి. అయితే అక్కడ సైనిక చర్యలు చేపట్టడం చాలా ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకారం తీసుకునే అవకాశం ఉంది.
అణు పదార్థాల స్వాధీనం – క్లిష్టమైన ఆపరేషన్
ఇరాన్ వద్ద ఉన్న అధిక శక్తి గల యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇది అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన ఆపరేషన్‌గా నిపుణులు భావిస్తున్నారు. అత్యున్నత శిక్షణ పొందిన అమెరికా సైనికులకు కూడా ఇది సవాలుగా మారే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికిప్పుడు సైన్యాన్ని పంపే విషయంపై అమెరికా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. అమెరికా ఇప్పటికే ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో దాడులు జరిగాయి. 120కి పైగా ఇరాన్ నౌకలు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు 13 మంది అమెరికా సైనికులు మరణించగా, సుమారు 200 మంది గాయపడ్డారు.