Artemis II: మరో చారిత్రక ఘట్టానికి నాసా రెడీ..చంద్రుని చుట్టిరానున్న మానవులు

Artemis II: చంద్రుని పైకి మానవులను పంపే చారిత్రక ఘట్టానికి రెండో దశ ఆర్టెమిస్ II కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

Update: 2026-03-31 05:18 GMT

Artemis II

Artemis II: చంద్రునిపైకి మానవులను పంపించే దిశలో మరో చారిత్రక ఘట్టానికి నాసా రెడీ అవుతోంది. ఆర్టెమిస్ II పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి టెస్టింగ్ కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. ఆర్టెమిస్ II నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ - ఓరియన్ అంతరిక్ష నౌకతో జరిపే మొట్టమొదటి మానవసహిత ప్రయోగం. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభం అయినట్టు నాసా తెలిపింది.

ఈ కౌంట్‌డౌన్ లో ఏమి జారుతుందంటే . .

కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభం కావడంతో, ఇంజనీర్లు ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను ఆన్ చేస్తూ, కమ్యూనికేషన్ లింకులను చెక్ చేయడం మొదలు పెట్టారు. లక్షల గ్యాలన్ల అతిశీతల లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్‌ను నింపడానికి అవసరమైన కచ్చితమైన ఇంధన నింపే క్రమం కోసం రాకెట్ క్రయోజెనిక్ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు. లాంచ్ ప్యాడ్ 39B వద్ద, టీమ్స్ సౌండ్ ప్రూఫ్ సిస్టం భారీ ట్యాంకును నీటితో నింపడం ప్రారంభిస్తాయి. ఈ నీరు, రాకెట్ నింగిలోకి ఎగిరే సమయంలో దాని సొంత ఇంజిన్ల నుంచి వచ్చే భయంకరమైన శబ్దం, వేడి నుంచి రక్షించడానికి భారీగా ఒక జలప్రళయం లాంటి సన్నివేశాన్ని సృష్టిస్తుంది.

నలుగురు వ్యోమగాములతో..

ఈ ప్రయోగంలో నలుగురు వ్యోమగాములు చంద్రుని పైకి వెళతారు. నాసా వ్యోమగాములు రీడ్ వైస్‌మాన్ , విక్టర్ గ్లోవర్ , క్రిస్టినా కోచ్ అలాగే, CSA (కెనడియన్ స్పేస్ ఏజెన్సీ) వ్యోమగామి జెరెమీ హాన్సెన్ ఈ టీమ్ లో ఉన్నారు. వీరు ఇప్పటికే ప్రయోగానికి శారీరకంగా సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారించుకోవడం కోసం క్లిష్టమైన ఆరోగ్య పర్యవేక్షణలో క్వారంటైన్ లో ఉంది వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్నారు. ప్రయోగానికి అవసరమైన శారీరక సిద్ధత కోసం అన్ని రకాలుగాను సంబంధిత నిద్రవేళలు, పోషకాహార ప్రణాళికలను పాటిస్తున్నారు.

ప్రయోగం ఎప్పుడంటే..

భారత కాలమానం ప్రకారం ఈ ప్రయోగం ఏప్రిల్ 2, గురువారం తెల్లవారు జామున 3:54 గంటలకు జరుగుతుంది. ఈ ప్రయోగాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. నాసా యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చని నాసా తెలిపింది.

వాతావరణం అంచనా ఇలా ఉంది..

ఇంధనం నింపే కార్యకలాపాలకు ముందు, నాసా అదేవిధంగా యూఎస్ స్పేస్ ఫోర్స్ స్పేస్ లాంచ్ డెల్టా 45లోని వాతావరణ అధికారులు వాతావరణ పరిస్థితులపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు . ప్రయోగం జరిగే రోజు వాతావరణ సూచన ప్రకారం, అనుకూలమైన వాతావరణం ఉండేందుకు 80% అవకాశం ఉంది. అయితే, ఆ ప్రాంతంలో మేఘాలు కమ్ముకోవడం, బలమైన గాలులు వీచే అవకాశం ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రయోగ సమయం వరకూ ప్రతి నిమిషం ఈ టీమ్స్ వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉంటాయి. వాతావరణ సూచనలను సంబంధిత మెషిన్ నిర్వాహకులతో సమన్వయము చేసుకుంటాయి.

ఆర్టెమిస్ II ఏమిటి?

నాసా మనుషులతో చంద్రుని వైపు వెళ్లే మిషన్ ఆర్టెమిస్. 1972 తరువాత చంద్రునిపైకి మనుషులను పంపడానికి చేస్తున్న ప్రయోగం ఇది. ఇందుల ఆర్టెమిస్ I మొదటి దశ సన్నాహాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో రెండో దశ ప్రయోగం ఆర్టెమిస్ II ఇప్పుడు జరగబోతోంది.

ఇందులో ఏమి చేస్తారు?

ఆర్టెమిస్ II లో ముఖ్యంగా చంద్రుని చుట్టూ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ (Orion spacecraft) తో వ్యోమగాములతో ప్రయాణాన్ని పరీక్షిస్తారు. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ పనితీరును చెక్ చేస్తారు. భూమికి-చంద్రునికి మధ్య ఉండే దీర్ఘకాల ప్రయాణానికి వ్యోమగాములు, స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణ సామర్ధ్యాన్ని పరిశీలిస్తారు.

ప్రయాణం ఎలా? ఎంతకాలం?

ఈ దశలో వ్యోమగాములు స్పేస్ లాంచ్ సిస్టమ్ ద్వారా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లో ప్రవేశించి చంద్రుని చుట్టూ వెళ్లి తిరిగి భూమికి వస్తారు. ఈ దశ (Artemis II)లో చంద్రునిపై ల్యాండింగ్ ఉండదు. ఈ మొత్తం ప్రయాణం 10 రోజుల పాటు ఉంటుంది.



Tags:    

Similar News