Debts: అప్పు తీసుకుని కట్టలేకపోతున్నారా.? ఇలా చేస్తే మీదిక రిస్క్ లేని జీవితమే..
Debts: అప్పుల ఊబిలో కూరుకుపోయారా? ఈఎంఐల భారం పెరిగిపోతోందా? అయితే సులభంగా అప్పుల నుంచి ఎలా బయటపడాలంటే.!
Debts: అప్పు తీసుకుని కట్టలేకపోతున్నారా.? ఇలా చేస్తే మీదిక రిస్క్ లేని జీవితమే..
Debts: ప్రస్తుత రోజుల్లో అప్పు చేయకుండా ఏ పనీ జరగని పరిస్థితి నెలకొంది. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, ఈఎంఐల రూపంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అప్పు చేస్తూనే ఉన్నారు. అయితే అప్పుల పైన అప్పులు చేస్తూ పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అప్పుల ఊబి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్ తెలిపారు.
గుడ్ డెట్ వర్సెస్ బ్యాడ్ డెట్:
పిల్లల ఎడ్యుకేషన్ కోసం లేదా హెల్త్ ఎమర్జెన్సీ కోసం చేసే అప్పులను 'గుడ్ డెట్' గా పరిగణించవచ్చు. ఎందుకంటే విద్య అనేది భవిష్యత్తు కోసం చేసే ఒక మంచి పెట్టుబడి లాంటిది. మన ప్రొడక్టివిటీని పెంచే ఏ అప్పు అయినా మంచిదే. కానీ కేవలం విలాసాల కోసం, ప్రొడక్టివిటీని పెంచని వాటి కోసం చేసే అప్పులన్నీ 'బ్యాడ్ డెట్' కిందకే వస్తాయి.
అప్పులు త్వరగా తీర్చడానికి 3 పద్ధతులు:
ఒకవేళ మీరు ఇప్పటికే అప్పుల్లో ఉంటే, వాటిని వేగంగా తీర్చడానికి ఈ పద్ధతులను పాటించవచ్చు:
స్నో బాల్ మెథడ్: మీరు చేసిన అప్పుల్లో ముందుగా చిన్న చిన్న అమౌంట్స్ ఉన్న వాటిని క్లియర్ చేసుకుంటూ రావాలి. పది మందికి చిన్న మొత్తాల్లో అప్పులు ఉన్నప్పుడు, ముందుగా నాలుగు చిన్న అప్పులు తీర్చేస్తే, అప్పుల వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
డెట్ అవలాంచ్ మెథడ్: ఈ పద్ధతిలో ముందుగా ఏ అప్పుకైతే అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నారో దానిపై ఫోకస్ చేయాలి. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను ముందు క్లియర్ చేస్తూ, తక్కువ వడ్డీ ఉన్నవాటిని నెమ్మదిగా తీర్చుకుంటూ వెళ్లాలి.
డెట్ కన్సాలిడేషన్: నలుగురు ఐదుగురి దగ్గర చిన్న చిన్న అప్పులు చేసి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకునే బదులు, ఒకే చోట పెద్ద మొత్తంలో (ఉదాహరణకు బ్యాంక్ పర్సనల్ లోన్) అప్పు తీసుకుని ఈ చిన్న అప్పులన్నీ ఒకేసారి తీర్చేయాలి. ఆ తర్వాత ఆ పెద్ద అప్పుకు ఒకే ఈఎంఐ కట్టుకుంటూ పోవడం సులభంగా ఉంటుంది.
అసెట్స్ క్రియేట్ చేయండి:
అప్పులు చేసి వస్తువులు కొంటూ పోతే ఈఎంఐల భారం పెరుగుతుంది. అదే క్రమశిక్షణతో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. మనం జీవితకాలం కష్టపడి పనిచేయలేం కాబట్టి, మన రిటైర్మెంట్ సమయానికి మనకు ఆదాయం తెచ్చిపెట్టే అసెట్స్‌ను క్రియేట్ చేయడంపైనే ఫోకస్ పెట్టాలి. చివరగా, మీరు కట్టలేనంత అప్పుల భారం ఉంటే, బ్యాంకులతో మాట్లాడి ఒకేసారి సెటిల్మెంట్ చేసుకునేలా ప్రయత్నించవచ్చు.