Fixed Deposit: బ్యాంక్‌లో FD చేస్తున్నవారికి గట్టి హెచ్చరిక.! మీ డబ్బు సేఫేనా.? ఇది తెలుసుకోండి

Fixed Deposit: ఆర్బీఐ ఇప్పటివరకు మన దేశంలో 78 బ్యాంకులను మూసివేసింది. ఒకవేళ బ్యాంకులు దివాళా తీస్తే మనం దాచుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల పరిస్థితి ఏంటి.?

Update: 2026-06-10 16:48 GMT

Fixed Deposit Safe 

Fixed Deposit: ఆర్బీఐ ఇప్పటివరకు మన దేశంలో 78 బ్యాంకులను మూసివేసింది. ఒకవేళ బ్యాంకులు దివాళా తీస్తే మనం దాచుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల పరిస్థితి ఏంటి.? బ్యాంకుల్లో డబ్బు సురక్షితమేనా లేదా పోస్ట్ ఆఫీస్‌లో దాచుకోవడం బెటరా.? ఈ అంశాలపై ఫైనాన్స్‌ ఎక్స్‌పర్ట్ ఏం చెప్పారంటే.?

దేశంలో ఏ బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నడవాలన్నా కచ్చితంగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. అయితే యాజమాన్యాల లోపాలు, కుంభకోణాలు, ప్రజా ధనాన్ని దిగమింగాలనే అత్యాశ వల్ల ఎన్నో బ్యాంకులు ఇబ్బందుల్లో పడుతున్నాయి. పరిస్థితి చేజారినప్పుడు ఆర్బీఐ వాటి గుర్తింపు రద్దు చేసి శాశ్వతంగా మూసివేస్తుంది. ఇలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రైవేట్, కోఆపరేటివ్, నేషనలైజ్డ్ బ్యాంకులు కలుపుకుని మొత్తం 78 బ్యాంకులు మూతపడ్డాయి.

బ్యాంకు మునిగితే మన డబ్బుల పరిస్థితి ఏంటి?

చాలామంది ప్రభుత్వ బ్యాంకులు అంటే 100 శాతం సురక్షితం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బ్యాంకులు ఏదైనా కారణంతో మూతబడితే, ఖాతాదారులకు ఇన్సూరెన్స్ కింద కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే వెనక్కి వస్తాయి. అంటే మీరు 25 లక్షలు లేదా కోటి రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా సరే మీకు దక్కేది ఆ 5 లక్షలు మాత్రమే.

మిగిలిన డబ్బును తీసుకురావడానికి బ్యాంకుల ఆస్తులను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా వేలం వేస్తారు. కానీ అందులో లోపాయికారీ ఒప్పందాల వల్ల ఖాతాదారులకు చిల్లిగవ్వ కూడా దక్కని పరిస్థితి ఉంటుంది. మూతపడ్డ 78 బ్యాంకుల్లో దాదాపుగా ఎవరికీ పూర్తి డబ్బులు తిరిగి రాలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బ్యాంకుల కంటే పోస్ట్ ఆఫీస్ 100 శాతం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి, మీరు పెట్టిన ప్రతి రూపాయికీ 100 శాతం ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. మీరు కోటి రూపాయలు దాచుకున్నా సరే, ఎలాంటి రిస్క్ లేకుండా ఆ కోటి రూపాయలు గ్యారెంటీగా తిరిగి వస్తాయి. బ్యాంకుల కంటే పోస్ట్ ఆఫీసుల్లోనే వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటున్నాయి.

పల్లెటూర్ల నుంచి నగరాల వరకు ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్ సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, బ్యాంకుల్లో ఎంత డబ్బు పెట్టినా 5 లక్షలకు మాత్రమే గ్యారెంటీ ఉంటుందని గ్రహించి, ప్రజలు తమ కష్టార్జితాన్ని 100 శాతం భద్రత ఉండే పోస్ట్ ఆఫీసుల్లో దాచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News