Mrunal Thakur: ఆ హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్..మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Update: 2026-04-10 07:08 GMT

Mrunal Thakur

Tamannaah: టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అడివి శేష్‌తో కలిసి నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నేడు (ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో, మృణాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి మృణాల్ చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

అమ్మాయిలతో స్నేహం కష్టమనుకున్నా కానీ..

మృణాల్ తన బాల్యం గురించి చెబుతూ.. నేను చిన్నప్పటి నుంచి అబ్బాయిలతోనే కలిసి పెరిగాను. అందుకే నాకు అమ్మాయిలతో స్నేహం చేయడం కొంచెం కష్టంగా అనిపించేది. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా ఆలోచన మారిపోయింది అని వెల్లడించారు. ఈ క్రమంలోనే తమన్నా తనకు అత్యంత సన్నిహితురాలిగా మారిందని చెప్పుకొచ్చారు.

తమన్నా ‘ప్యూర్ సోల్’.. ఒక సిస్టర్‌లా!

తమన్నా ఈజ్ మై బెస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఆమె మనసు చాలా స్వచ్ఛమైనది. మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. నేను ఏ విషయాన్నైనా ఆమెతో నిర్మొహమాటంగా పంచుకుంటాను అంటూ తమన్నాపై కితాబిచ్చారు మృణాల్. అంతేకాకుండా, తమన్నా తనకు ఒక అక్కలాగా సలహాలు ఇస్తుందని, ముఖ్యంగా జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో" నేర్పిస్తుందని ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో వీరిద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ 'లస్ట్ స్టోరీస్ 2'లో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం మరింత బలపడినట్లు తెలుస్తోంది.

నేడే ‘డెకాయిట్’ జాతర

అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ‘డెకాయిట్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా ప్రమోషన్లలో మృణాల్ చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే, ఈ చిత్రం కూడా ఆమె ఖాతాలో మరో హిట్‌గా చేరడం ఖాయమనిపిస్తోంది.

Tags:    

Similar News