Tu Yaa Main OTT: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. మొసలి నుంచి ప్రేమ జంట ఎలా తప్పించుకుంది.?
Tu Yaa Main OTT: బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ ‘తు యా మై’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
Tu Yaa Main OTT
Tu Yaa Main OTT: బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ ‘తు యా మై’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆదర్శ్ గౌరవ్, షనయా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకోగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఓటీటీలోకి ‘తు యా మై’.. ఎక్కడ చూడొచ్చు?
ఫిబ్రవరి 13న విడుదలైన ఈ చిత్రం రెండు నెలల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. నేటి నుంచి (ఏప్రిల్ 10) ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సినిమాకు బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. నటీనటులుగా ఆదర్శ్ గౌరవ్, షనయా కపూర్ జంటగా కనిపించగా… పరుల్ గులాటీ, మోనా సింగ్, సిద్ధార్థ్ సిబల్ ముఖ్య పాత్రల్లో నటించారు.
2018లో వచ్చిన థాయ్ థ్రిల్లర్ ‘ది పూల్’ నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రాన్ని కలర్ యెల్లో ప్రొడక్షన్స్ భానుశాలి స్టూడియోస్ కలిసి నిర్మించాయి.
ప్రేమతో మొదలై… ప్రాణాల కోసం పోరాటంగా
కథలో అవని షా (షనయా కపూర్) ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. మారుతి కడమ్ అలియాస్ ఫ్లోపరా (ఆదర్శ్ గౌరవ్) నలసోపారా ప్రాంతానికి చెందిన ఎదుగుతున్న రాపర్. ఒక కొలాబరేషన్ వీడియో కోసం వీరిద్దరూ కలుసుకుంటారు. మొదట అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా… ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ కలిసి గోవాకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ ప్రయాణంలో అనుకోని పరిస్థితి ఎదురవుతుంది. ఒక పాడుబడిన హోటల్‌లో చిక్కుకున్న వీరు అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు. అయితే అక్కడ ఉన్న ప్రమాదం గురించి వారికి తెలియదు. ఒక్కసారిగా పూల్‌లో మొసలి కనిపించడం వల్ల వారి జీవితమే తలకిందులవుతుంది.
మొసలి మధ్యలో సర్వైవల్ డ్రామా… థ్రిల్ ఎలా ఉంది?
పూల్‌లో చిక్కుకున్న ప్రేమజంటకు బయటకు రావడం అంత సులభం కాదు. మొసలి దాడి చేసే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు వారు చేసే ప్రయత్నాలే సినిమా అసలు థ్రిల్.
డైరెక్టర్ బెజోయ్ నంబియార్ ఈ కథను సర్వైవల్ డ్రామాగా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. చిన్న స్థలంలోనే జరిగే కథ అయినా… ప్రతి సన్నివేశంలో టెన్షన్ పెంచేలా కథనాన్ని నడిపించారు. ఆదర్శ్ గౌరవ్ నటన కథకు బలం కాగా… షనయా కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. రొమాన్స్ నుంచి భయానికి మారే భావాలను ఇద్దరూ బాగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా థ్రిల్‌ను మరింత పెంచుతుంది.
మొత్తం మీద ప్రేమ కథతో ప్రారంభమై ప్రాణాల కోసం పోరాటంగా మారే ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులకు ఆసక్తికర అనుభవం ఇస్తుంది. థ్రిల్లింగ్ కథలు ఇష్టపడే వారికి ‘తు యా మై’ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు.