Nandyala: కొత్త సీసాలో పాత సారా.. అంటూ ఇస్సాక్ బాష ఎద్దేవా!
Nandyala: నంద్యాల వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Nandyala: కొత్త సీసాలో పాత సారా.. అంటూ ఇస్సాక్ బాష ఎద్దేవా!
Nandyala: అమరావతి రాజధాని తీర్మానంపై నంద్యాలలో వైసీపీ ఆగ్రహం.“కొత్త సీసాలో పాత సారా” – టీడీపీపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష తీవ్ర విమర్శలు, నంద్యాలలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరావతి రాజధాని అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ చేసిన తీర్మానంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. “కొత్త సీసాలో పాత సారా లాగా అమరావతి పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు” అని విమర్శించారు.
అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం శాసనమండలిలో ఎందుకు అదే తీర్మానం ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. మండలిలో తమకు బలం లేకపోవడం వల్లే ప్రభుత్వం వెనుకడుగు వేసిందని ఆరోపించారు.
అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసి ప్రజలకు తెలియజేస్తామని హెచ్చరించిన ఇస్సాక్ బాష, “ఇది ప్రజల అభివృద్ధి కోసం కాదు, మీ ధనదాహం కోసం చేస్తున్న రాజకీయ డ్రామా” అని ఎద్దేవా చేశారు.
టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ల్యాండ్ మాఫియాకు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపిస్తూ, రానున్న రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.