Minister Narayana: టిడ్కో ఇళ్లపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు!
Minister Narayana: ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ టిడ్కో ఇళ్లపై కీలక ప్రకటన చేశారు.
Minister Narayana: టిడ్కో ఇళ్లపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు!
Minister Narayana: 2014 లోనే పేదలకు చక్కటి ఇళ్ళు కట్టమని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని చెప్పారు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. ఎంత ఖర్చైనా సరే అక్కచెల్లెమ్మలకు మంచి ఇళ్ళను నిర్మించాలని ఆదేశించారు. దేశ విదేశాలు తిరిగి అధ్యయనం చేశానని చెప్పారు.. ఏడు లక్షల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
షీర్వాన్ టెక్నాలజీ తో నిర్మాణాలు చేపట్టామని, నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ళ నిర్మాణం చేపట్టామని చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అన్ని ఏర్పాట్లు చేసేలా డిజైన్ చేసామని, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా వచ్చి టిడ్కొ ఇళ్లను పరిశీలించి వెళ్లారని తెలిపారు మంత్రి నారాయణ. మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు చేశాని చెప్పారు.
అటువంటి ప్రాజెక్ట్ ను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని. టీడీపీ పై కోపంతో పేద ప్రజలకు తీరని అన్యాయం చేశారని. టిడ్కో ఇళ్ళ నిర్మాణ సంఖ్యను కుదించేశారని గుర్తు చేశారు. చేపట్టిన వాటిని కూడా అసంపూర్తిగా వదిలేసి, డబ్బులు కట్టిన పేదలను నట్టేట ముంచారని విమర్శించారు. అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం పై పదిలక్షల కోట్ల భారం వేసి వెళ్లారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవంతో ఆర్ధిక పరిస్థితి గాడిలో పడుతోందని. గత ప్రభుత్వం తప్పు చేసినా. ప్రజలు ఇబ్బంది పడకూడదని, సీఎం చంద్రబాబు భావించారని తెలిపారు.
140 కోట్లు బ్యాంకుకి చెల్లించామని, టిడ్కో ఇళ్లకోసం డబ్బులు కట్టిన 83,869 మంది ని గత ప్రభుత్వం గాలికొదిలేసి వెళ్లిపోయిందని చెప్పారు మంత్రి నారాయణ. వాళ్లందరికీ డబ్బులు తిరిగీ ఇచ్చేందుకు 173 కోట్లను సీఎం మంజూరు చేశారని తెలిపారు. ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా టిడ్కో ప్రాజెక్ట్ పునర్నిర్మాణానికి 4400 కోట్లు సిఎం కేటాయించారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా టిడ్కో ఇళ్లను సిద్ధం చేస్తున్నామని, నెలల వ్యవధిలోనే. విడతల వారీగా ఏడు లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ.