Nandyala: వైద్యం అందుతోంది.. కానీ వసతులేవి?

Nandyala: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులు (Attenders) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2026-03-30 09:25 GMT

Nandyala: వైద్యం అందుతోంది.. కానీ వసతులేవి?

Nandyala: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల అటెండర్ల బాధలు దయనీయ పరిస్థితి తీర్చే దెవరు?  మనుషుల పక్కనే కుక్కల నిద్ర. సమస్యలకు పరిష్కారం ఎప్పుడు..? నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం. పేషెంట్ల అటెండర్ల సమస్యలను మాత్రం పూర్తిగా విస్మరించినట్టుగా కనిపిస్తోంది.

పేషెంట్ల కోసం రాత్రింపగళ్ళు సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిలో. వారి వెంట వచ్చిన బంధువుల పరిస్థితి మాత్రం ఎంతో దయనీయంగా మారింది. అటెండర్ల కోసం ప్రత్యేకంగా నిర్మించిన షెడ్డును ఆసుపత్రి అధికారులు పనికిరాని సామాగ్రితో, బెడ్స్, బెంచీలతో నింపి తాళం వేయడంతో. వారు రాత్రిళ్లు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓ పక్క ఉక్కపోత. మరోపక్క దోమల బెడద. ఇంకో వైపు మనుషుల పక్కనే కుక్కలు నిద్రపోతున్న దృశ్యాలు చూస్తే. ఎవరికైనా హృదయం కరిగిపోకుండా ఉండదు. ఓపీ కేంద్రంలోని క్యూ లైన్లలోనే పేషెంట్ అటెండర్లు నేలపై పడుకొని విశ్రాంతి తీసుకోవడం. అక్కడే కుక్కలు సంచరిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

గతంలో అటెండర్ల రెస్ట్ రూమ్ వద్ద కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని కారణంగా అధికారులు ఆ షెడ్డును మూసివేసినప్పటికీ. దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో అటెండర్లు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ. సమస్యను పరిష్కరించడానికి రాజకీయ నాయకులు, అధికారులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

ఇకనైనా సంబంధిత వైద్యాధికారులు స్పందించి. పేషెంట్ల అటెండర్లకు కనీస వసతులు కల్పిస్తూ. మానవత్వంతో వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. పేషెంట్ సేవలతో పాటు. అటెండర్ల సంక్షేమం కూడా ముఖ్యం అనే విషయాన్ని అధికారులు ఇప్పుడైనా గ్రహిస్తారా..? ఇకనైనా వైద్యాధికారులు స్పందించి ఎక్కడుంటే అక్కడ పడుకున్న పేషెంట్ ల అటెండెంట్ లను బయటికి తరిమేయకుండా సానుకూల దృపథం తో ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం.

Tags:    

Similar News