Nellore: ఆటో నగర్ వాసులకు గుడ్ న్యూస్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనుల జాతర
Nellore: నెల్లూరు రూరల్ 29వ డివిజన్ ఆటో నగర్‌లో రూ. 75 లక్షలతో డ్రైనేజీ పనుల శంకుస్థాపన. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషితో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు.
Nellore: ఆటో నగర్ వాసులకు గుడ్ న్యూస్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనుల జాతర
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్, ఆటో నగర్ లో రూ. 75 లక్షలతో డ్రైన్ లకు, మరియు 3 బాక్స్ కల్వర్టులకు, ఆటో నగర్ వాసులతో కలసి శంకుస్థాపన చేశారు నెల్లూరు ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ (ఇ) వీరా శేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు..
ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 29వ డివిజన్ అభివృద్ధికి 2 కోట్ల 75 లక్షల నిధులు , రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేటాయించారని చెప్పారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఏపీఐఐసీ వుడ్ కాంప్లెక్స్, ఇండస్ట్రియల్ పార్క్ మరియు ఆటో నగర్ నందు, 3కోట్ల 54లక్షల నిధులు కేటాయించామని చెప్పారు..
నిధుల లభ్యతను బట్టి రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు..
ఆమంచర్ల MSME పార్క్ పూర్తిస్థాయిలో వినియోగంలో ఉందని, మరో 30 ఎకరాల్లో ఆమంచర్ల MSME పార్కు ను అభివృద్ధి చేసేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు..
ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరియు కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో ఏపీ రీడింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కనపర్తి గంగాధర్, క్లస్టర్ ఇంచార్జ్ సాబీర్ ఖాన్, కో క్లస్టర్ ఇంచార్జ్ లు తిప్పిరెడ్డి మమతారెడ్డి, లక్ష్మీ రెడ్డి, 29వ డివిజన్ టిడిపి డివిజన్ అధ్యక్షుడు గుద్దేటి చెంచయ్య, జిజిహెచ్ అభివృద్ధి కమిటీ మెంబర్ మొగరాల సురేష్ , నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అస్లాం, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి టి.ఎన్.టి.యు.సీ. అధ్యక్షుడు జహీర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు సయ్యద్ ఖాదర్, టిడిపి నాయకులు షేక్ జిలాని, పావళ్ళ ప్రసాద్, పోలూరు సుధాకర్, అబ్దుల్, అజీజ్, రెహమాన్, దస్తగిరి, గీతాకృష్ణ, నవీన్ రెడ్డి, మల్లీశ్వరరావు, నారాయణ యాదవ్, వాజిద్, జయరాం, సురేష్ రెడ్డి, షాజహాన్, సల్మాన్, ఖాదర్, దావూద్, యాకూబ్, సికిందర్, గుద్దేటి భాస్కర్, కే.వై. దయ బృంగి, ఖలీల్, గౌస్ బాష, జహీద్, ఆరిఫ్, పవన్, జనసేన నాయకులు చుక్కల భీమయ్య, సుబ్రహ్మణ్యం, బిజెపి నాయకులు పొందమల్లి గుంజి కృష్ణ, సతీష్, నెల్లూరు ఆటోనగర్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.