Nandyala: మూడు గంటలు.. ఒక అగ్గిపెట్టె.. అద్భుత రామాయణం!
Nandyala: నంద్యాల చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ శ్రీరామనవమి సందర్భంగా అగ్గిపెట్టెపై మైక్రో పెయింటింగ్ ద్వారా రామాయణ ఘట్టాలను చిత్రించారు.
Nandyala: మూడు గంటలు.. ఒక అగ్గిపెట్టె.. అద్భుత రామాయణం!
Nandyala: నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా చిన్న అగ్గి పెట్టె మీద మైక్రో పెన్నుతో, మైక్రో బ్రష్ లతో వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో మూడు గంటల్లో రామాయణం లోని ప్రధాన ఘట్టాలు చిత్రీకరించారు.
ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ :
చిత్రం లో శ్రీరాముని జననం నుండి సీతా దేవి అగ్ని పరీక్ష వరకు జరిగిన ఘటనలను కళ్ళకు కట్టినట్లు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడిగా దశరథ మహారాజుకు, కౌసల్య కు జన్మించిన ఘట్టాలను వేసి , శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, పురు షోత్తముడు, పరాక్రమవంతుడు, ఆదర్శ ప్రాయుడు, పితృ వాక్యపరిపాలకుడని , తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిన ఆదర్శ కుమారుడని కొనియాడారు....
సోదరులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు ప్రజలను కన్న బిడ్డలాగ చూసుకునేవారని , శ్రీరామచంద్రుడు ధర్మ మార్గాన్ని ఆచరిస్తారు కాబట్టి అందరికి ఆదర్శప్రాయుడన్నారు , అందుకే రామాయణం గురించి ఎన్ని సార్లు విన్న, రామాయణం గురించి ఎన్ని సార్లు బొమ్మలు వేసిన నాకు తనివి తీరదని చెప్పారు....
ఈ చిత్రం లో దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి వారు తమ పిల్లలైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలను ముద్దాడు తున్నట్లు, రామ, లక్ష్మణులు విశ్వామిత్రుని దగ్గర శిష్యరికంలో వున్నట్లు, యజ్ఞం భంగం చేస్తున్న రాక్షసులను రామలక్ష్మణులు సంహారిస్తున్నట్లు, అహల్య శాప విమోచన, రాముడు శివ ధనుస్సు విరిచినట్లు,సీతారాముల కళ్యాణం, తండ్రి దగ్గర సెలవు తీసుకొని వనవాసం వెళుతున్న రామ, లక్ష్మణ, సీతమ్మ, రాముని పాదరక్షలు తీసుకుంటున్న భరతుడు,
రామునికి జింకను చూపిస్తున్న సీతమ్మ, మారు వేషంలో రావణుడు, సీతాదేవిని అపహారించి పోతున్నప్పుడు సీతమ్మ కాపాడుట కోసం జటాయువు అనే పక్షి అడ్డం వస్తే దాన్ని రెక్కలు రావణుడు నరుకుతున్నట్లు, రామునికి ప్రేమతో పళ్ళు తినిపిస్తున్న శబరి,వాలి సంహారం, సీతమ్మ జాడ కోసం హనుమంతుడు ఆకాశంలో పోతున్నట్లు, సీతా దేవి ఇచ్చిన చూడామణిని హునుమ తీసుకున్నట్లు,
లంకా దహనం, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తులతో యుద్ధం చేస్తున్న రామలక్ష్మణులు, యుద్ధంలో మూర్ఛ పోయిన లక్ష్మణుడు, సంజీవ పర్వతం తెస్తున్న హనుమాన్, రామ రావణ యుద్ధంలో రావణుడి సంహారం, అగ్ని పరీక్షలో మహా సాద్వి సీతమ్మ వున్నట్లు ఇలా ఇన్ని ప్రధాన ఘట్టాలను చిన్న అగ్గిపెట్టె పై వేసాను. శ్రీరాముని మీద వున్నా భక్తితో ఈ చిత్రం వేసానన్నారు.
భక్తులందరికి శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.