Pamidi: పామిడిలో "ఇంటింటికీ కూటమి ప్రభుత్వం" వెంకట శివుడు యాదవ్!
Pamidi: పామిడి 3వ వార్డులో "ఇంటింటికీ కూటమి ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న వెంకట శివుడు యాదవ్. పథకాలు వివరిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Pamidi: పామిడిలో "ఇంటింటికీ కూటమి ప్రభుత్వం" వెంకట శివుడు యాదవ్!
Pamidi: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణంలోని 3వ వార్డు*లో సోమవారం *"ఇంటింటికీ కూటమి ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు.
ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ గత పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు ముగింపు పలికి, అభివృద్ధి–సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్, పేదలకు ఇళ్ల నిర్మాణం, రైతులకు రైతు సంక్షేమ కార్యక్రమాలు, యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.
"ప్రజల వద్దకు ప్రభుత్వం" అనే ఆలోచనతో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల వివరాలను తెలియజేయడంతో పాటు, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు.
అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదని, గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతులు మెరుగుపడినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
అందుకే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.మంత్రి నారా లోకేష్ యువతకు అండగా నిలిచే నాయకత్వానికి ప్రజల మద్దతు మరింత బలపడుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ అధ్యక్షులు బొమ్మ మోహన్, క్లస్టర్ ఇంచార్జి జింకల సంజీవ, యూనిట్ ఇంచార్జి ఓబులకృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ సీనా, మాజీ గుత్తి పట్టణ అధ్యక్షులు నరేంద్ర చౌదరి, రామాంజనేయులు, బూత్ కన్వీనర్ పవన్, ఐటీడీపీ పురుషోత్తం, జగన్, రవి, సుంకప్ప, సుధాకర్ నాయుడు, దాదా, బాబావలి, తిమ్మప్ప, రాజేంద్ర, శివ శంకర్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.