Kasapuram: కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం
Kasapuram: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.1,00,116 విరాళం అందజేసిన సులోచనమ్మ. ఆలయ అధికారులకు నగదు అందజేసిన దాత.
Kasapuram: కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం
Kasapuram: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం*కు భక్తుల నుంచి భారీ విరాళం అందింది.
కర్నూలు జిల్లా ఆస్పరి గ్రామ వాస్తవ్యులు కీ.శే ఎం. నరసన్న గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని ఎం. సులోచనమ్మ గారు ఆలయ అభివృద్ధి నిమిత్తం రూ.1,00,116/- నగదు విరాళంగా అందజేశారు.
ఈ మొత్తాన్ని ప్రధాన అర్చకులు శ్రీ కె. రాఘవాచార్యులు, పర్యవేక్షకులు శ్రీ పి. వెంకటేశ్వర్లు వారి ఆధ్వర్యంలో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు శ్రీ టి. దేవేంద్రనాథ్ గారు, సీనియర్ సహాయకులు బి. వేమన్న గారు తదితరులు పాల్గొన్నారు.
దాత దంపతుల సేవలను గుర్తు చేసుకుంటూ ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చిన సులోచనమ్మ గారిని ఆలయ అర్చకులు, సిబ్బంది అభినందించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.