Kadiri: కదిరి నిత్య అన్నదానానికి వంట సామాగ్రి అందజేసిన నిసార్ యాసిన్ ఖాన్!

Kadiri: కదిరి ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ సమైక్య నిత్య అన్నదానానికి వంట సామాగ్రి విరాళంగా ఇచ్చిన సిమ్స్ హాస్పిటల్ ఎండీ నిసార్ యాసిన్ ఖాన్.

Update: 2026-08-18 06:06 GMT

Kadri: కదిరి నిత్య అన్నదానానికి వంట సామాగ్రి అందజేసిన నిసార్ యాసిన్ ఖాన్!

Kadri: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ సమైక్య నిత్య అన్న సత్రంలో నిరంతరంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమానికి అవసరమైన వంట సామాగ్రిని సిమ్స్ హాస్పిటల్ ఎండీ, NYPSN ఫౌండర్ నిసార్ యాసిన్ ఖాన్ అందించారు.

నిత్య అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేందుకు తనవంతు సహకారం అందించిన నిసార్ యాసిన్ ఖాన్‌కు సత్రం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సైదాపురం ఆంజనేయస్వామి అర్చకులు పాపయ్య శాస్త్రి, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకులు కుమార రాజా ఆచార్యులు, శివరాం, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News