Anantapur: సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ రమాదేవి దగ్గుపాటి
Anantapur: వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రమాదేవి.
Anantapur: సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ రమాదేవి దగ్గుపాటి
Anantapur: అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో కలిసి రమాదేవి దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ పదవి కల్పించినందుకు రమాదేవి, ఆమె భర్త టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు వస్తాయనడానికి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి దక్కడం నిదర్శనమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఒక సామాన్య బీసీ మహిళకు ఎమ్మెల్సీ పదవి రావడం చిన్న విషయం కాదని, టీడీపీతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.
జిల్లాలోని ప్రజాప్రతినిధులందరితో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎమ్మెల్సీ రమాదేవికి సూచించారు.ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పనిచేస్తానని నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి తెలిపారు. తనపై
నమ్మకంతో అప్పగించిన పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని చెప్పారు.మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన బీసీ మహిళకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడంపై సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హర్షం వ్యక్తం చేశారు.