Anantapur: ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవి.. మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు!
Anantapur: అనంతపురం జిల్లాకు చెందిన వడ్డెర సామాజిక వర్గ నేత దళవాయి రమాదేవి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు.
Anantapur: ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవి.. మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు!
అనంతపురం: విజయవాడలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి విజయవాడలోని అసెంబ్లీ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్, గవర్నర్ కోటాలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎంపికైన దలవాయి రమాదేవి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, మంత్రి నారా లోకేష్ కి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కి, అలాగే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కి దలవాయి రమాదేవి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దలవాయి వెంకటనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినాయకత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
అనంతపురం నియోజకవర్గంలో టిడిపి క్లస్టర్ ఇంచార్జ్‌గా సేవలందిస్తున్న, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దలవాయి రమాదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి మరియు నారా లోకేష్ కి ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు.