Kasapuram: నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు

Kasapuram: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, నూతన వధూవరులకు ఆశీస్సులు.

Update: 2026-08-16 01:52 GMT

Kasapuram: నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు

Kasapuram: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గారు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం అభివృద్ధి కూడా అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కసాపురం ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, గుంతకల్లు పట్టణం మరియు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News