Gooty: గుత్తి విద్యుత్ శాఖకు 56 అవార్డుల పంట!

Gooty: 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ గుత్తి డివిజన్ విద్యుత్ శాఖకు 56 అవార్డులు. పామిడి మండలం ఉద్యోగులకు లభించిన ప్రత్యేక గుర్తింపు.

Update: 2026-08-15 10:30 GMT

Gooty: గుత్తి విద్యుత్ శాఖకు 56 అవార్డుల పంట!

Gooty: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుత్తి డివిజన్ విద్యుత్ కార్యాలయం నందు ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ అధికారి శ్రీ పి. పద్మనాభ పిళ్ళై చేతుల మీదుగా జెండా వందనం అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గుత్తి ADA , పామిడి AE శ్రీ మధుసూదన్ పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.అనంతపురం జిల్లా గుత్తి విద్యుత్ శాఖ డివిజన్ పరిధిలోని పామిడి మండలంలో పనిచేస్తున్న 4 మంది ఉద్యోగులు అవార్డులు అందుకున్నారు. వీరిలో ఒకరు జిల్లా ఉత్తమ ఉద్యోగిగా, ముగ్గురు డివిజన్ స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు.

అవార్డు గ్రహీతల వివరాలు:

1. తిరుపాల్ నాయక్ - సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్

2. దేవేంద్ర నాయక్ - సబ్ స్టేషన్ ఆపరేటర్, ఎద్దులపల్లి సబ్ స్టేషన్, పామిడి మండలం

3. ఎర్ర స్వామి - ఫీల్డ్ అసిస్టెంట్, ఎద్దులపల్లి సబ్ స్టేషన్ పరిధి, పామిడి మండలం

4. మమ్మద్ - జూనియర్ లైన్‌మెన్, పాలెం గ్రామం, పామిడి మండలం

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం, విధి నిర్వహణలో చూపిన నిబద్ధతకు గాను వీరిని ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా అధికారులు అవార్డు గ్రహీతలను అభినందించారు. ఇలాగే మరింత బాధ్యతగా పనిచేసి ప్రజలకు సేవ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గుత్తి డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News