Anantapur: న్యాయవాదిపై సీఐ దాడి.. క్షమాపణ చెప్పాలని లాయర్ల బైఠాయింపు!

Anantapur: వాహనాల తనిఖీ సందర్భంగా యువ న్యాయవాదిపై సీఐ దాడి చేశారని ఆరోపిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి తీవ్ర ఆందోళన చేపట్టారు.

Update: 2026-08-14 16:36 GMT

Anantapur: న్యాయవాదిపై సీఐ దాడి.. క్షమాపణ చెప్పాలని లాయర్ల బైఠాయింపు!

అనంతపురం: పోలీసులు వాహనాల తనిఖీ కార్యక్రమంలో భాగంగా యువ న్యాయవాది గౌతమ్ రాజు సిఐ శ్రీకాంత్ యాదవ్ మధ్య తలెత్తిన వివాదం నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. వాహనాలు తనిఖీ సందర్భంగా న్యాయవాది గౌతమ్ రాజు పట్ల సిఐ శ్రీకాంత్ యాదవ్ భౌతికంగా దాడి చేయడంతో పాటు దుర్భాషలాడి పోలీస్ సతీవ్ర వివాదానికి దారి తీయడంతో మూడు గంటలుగా న్యాయవాదుల అసోసియేషన్ రోడ్ పై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

న్యాయవాదిపై దాడి చేసినందుకు బాధ్యులైన సిఐ శ్రీకాంత్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లేదా తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళన ఉదృతం చేశారు. కాగా న్యాయవాదిని వాహనాలు తనిఖీలో భాగంగా లైసెన్స్ అడుగగా దురుసుగా వివరించడంతో పోలీస్ స్టేషన్ తరలించామని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. న్యాయవాదుల డిమాండ్ మేరకు సీఐ క్షమాపణ చెప్పడానికి అందుబాటులో లేకపోవడంతో న్యాయవాదుల ఆందోళన ఉదృతం చేస్తామని జిల్లా స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News